కీర్తనలు 70

70
కీర్తన 70
సంగీత దర్శకునికి. దావీదు అభ్యర్థన కీర్తన.
1దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి;
యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి.
2నా ప్రాణం తీయాలని కోరేవారు
సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి;
నా పతనాన్ని కోరేవారందరు
అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.
3నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు
సిగ్గుపడి ఆశాభంగం పొందాలి.
4అయితే మిమ్మల్ని వెదికేవారంతా
మీలో ఆనందించి సంతోషించాలి;
మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు,
“యెహోవా గొప్పవాడు!” అని అనాలి.
5కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను;
దేవా! నా దగ్గరకు త్వరగా రండి,
మీరే నా సహాయం, నా విమోచకుడు;
యెహోవా, ఆలస్యం చేయకండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 70: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి