కీర్తనలు 93
93
కీర్తన 93
1యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు;
యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు;
నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది.
2మీ సింహాసనం ఆది నుండి సుస్థిరమే.
అనాది కాలం నుండి మీరున్నారు.
3యెహోవా, నదులలో వరదలు లేచాయి,
నదులు ఉరుములా గర్జిస్తున్నాయి,
అలలు చెలరేగుతున్నాయి.
4జలప్రవాహాల ఘోష కన్నా
బలమైన సముద్ర తరంగాల కన్నా,
యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు.
5యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి;
యెహోవా మీ మందిరం
అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 93: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.