జెకర్యా 3

3
ప్రధాన యాజకునికి శుభ్రమైన వస్త్రాలు
1అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను#3:1 మూ.భా.లో సాతాను అనగా విరోధి అతని కుడి ప్రక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు. 2అప్పుడు యెహోవా సాతానుతో, “సాతానా, యెహోవా నిన్ను గద్దిస్తారు! యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తారు! ఈ మనిషి మంటలో నుండి తీసిన మండుతున్న కర్రలాంటి వాడు కాదా?” అని అన్నారు.
3అయితే యెహోషువ మురికిబట్టలు వేసుకుని దేవదూత ముందు నిలబడి ఉన్నాడు. 4దూత తన ముందు నిలబడి ఉన్నవారితో, “అతని మురికిబట్టలు తీసివేయండి” అని చెప్పాడు.
అప్పుడు అతడు యెహోషువతో, “చూడు, నేను నీ పాపాన్ని తీసివేశాను, నీకు మంచి వస్త్రాలు వేస్తాను” అన్నాడు.
5అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టండి” అని చెప్పగా, యెహోవా దూత ప్రక్కన నిలబడి ఉండగా వారు అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచి, అతనికి బట్టలు తొడిగించారు.
6తర్వాత యెహోవా దూత యెహోషువకు ఈ ఆదేశం ఇచ్చాడు: 7“సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు నాకు లోబడి జీవిస్తూ, నా మార్గాలను పాటిస్తే, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణాల మీద అధికారం కలిగి ఉంటావు. ఇక్కడ నిలబడి ఉన్న వారి మధ్యలో నేను నీకు స్థానం ఇస్తాను.
8“ ‘ప్రధాన యాజకుడవైన యెహోషువా! విను; నీవూ, నీ ఎదుట కూర్చుని ఉన్న నీ సహచరులు జరగబోయే వాటికి సూచనలుగా ఉన్నారు: చిగురు అనే నా సేవకుడిని నేను తీసుకురాబోతున్నాను. 9నేను యెహోషువ ఎదుట ఉంచిన రాతిని చూడండి. ఆ రాయికి ఏడు కళ్లు ఉన్నాయి,#3:9 లేదా కోణాలు నేను దాని మీద ఒక శాసనం చెక్కుతాను, ఒకే రోజులోనే నేను ఈ దేశపు పాపాన్ని తొలగిస్తాను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
10“ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

జెకర్యా 3: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి