2 దినవృత్తాంతములు 14:11
2 దినవృత్తాంతములు 14:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి “యెహోవా, మహా సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేనివారికి సహాయం చేయడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టే ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా! నువ్వే మా దేవుడివి. మానవమాత్రులను నీ మీద జయం పొందనీయకు” అని ప్రార్థించాడు.
2 దినవృత్తాంతములు 14:11 పవిత్ర బైబిల్ (TERV)
ఆసా తన దేవుడైన యెహోవాకు యిలా ప్రార్థన చేశాడు “ప్రభూ, బలవంతుల నుండి బలహీనులను రక్షించేవాడవు నీ వొక్కడివే! ఓ ప్రభూ, మా దైవమా మాకు సహాయం చేయుము! మేము నీమీద ఆధారపడి యున్నాము. ఈ మహా సైన్యాన్ని నీ పేరుతో మేము ఎదిరించబోతున్నాము. యెహోవా, నీవు మా దేవుడవు. నీమీద విజయాన్ని ఎవ్వరికీ చేకూర నీయకుము!”
2 దినవృత్తాంతములు 14:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి – యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా
2 దినవృత్తాంతములు 14:11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.