2 సమూయేలు 23:3-4
2 సమూయేలు 23:3-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు, అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
2 సమూయేలు 23:3-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు. –మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగియేలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బులేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.
2 సమూయేలు 23:3-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇశ్రాయేలు దేవుడు మాట్లాడారు, ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం నాతో ఇలా అన్నారు: ‘మనుష్యుల మధ్య నీతిగా పాలించేవాడు, దేవుని భయం కలిగి పాలించేవాడు, అతడు మబ్బులు లేని ఉదయాన సూర్యోదయపు వెలుగులాంటివాడు, వాన వెలిసిన తర్వాతి వచ్చే తేజస్సులాంటివాడు; అది భూమి నుండి గడ్డిని మొలిపిస్తుంది.’
2 సమూయేలు 23:3-4 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు: ‘ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో, ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు, ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంతంగా వుంటాడు, లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.’