యెహెజ్కేలు 9:3-4
యెహెజ్కేలు 9:3-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలీయుల దేవుని మహిమ అది ఉన్న కెరూబు మీది నుండి పైకి వెళ్లి ఆలయ గడప దగ్గరకు వచ్చి నిలిచింది. అప్పుడు యెహోవా నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకుని ఉన్న వానిని పిలిచి, యెహోవా అతనితో, “నీవు వెళ్లి యెరూషలేము పట్టణమంతా తిరిగి అక్కడ జరుగుతున్న అసహ్యకరమైన పనులన్నిటిని బట్టి దుఃఖించి విలపించే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టు” అన్నారు.
యెహెజ్కేలు 9:3-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు నుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గరికి వచ్చి నిలిచింది. ఆయన నార బట్టలు వేసుకున్న లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తిని పిలిచాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “యెరూషలేము పట్టణంలో ప్రవేశించి అక్కడ తిరుగు. పట్టణంలో జరుగుతున్న అసహ్యమైన పనులను గూర్చి మూలుగుతూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్న వాళ్ళ నుదుటిపై ఒక గుర్తు పెట్టు.”
యెహెజ్కేలు 9:3-4 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమ కెరూబు దూతల మీదుగా లేచి అతను ఎక్కడకు వెళ్లాడో అక్కడకి వచ్చింది. ఆ తేజస్సు ఆలయ ద్వారం వద్దకు వచ్చింది. గడప మీదకు వచ్చి తేజస్సు ఆగింది. తరువాత నారబట్టలు వేసుకొని, లేఖకుని సామగ్రి ధరించి ఉన్నవానిని ఆ తేజస్సు పిలిచింది. పిమ్మట యెహోవా (మహిమ) అతనితో, “యెరూషలేము నగరం గుండా వెళ్లు. ఈ నగరంలో ప్రజలు చేస్తున్న భయంకరమైన పనులన్నిటికీ కలత చెంది, విచారిస్తున్న వారి ఒక్కొక్కరి నుదుటి మీద ఒక గుర్తు పెట్టు” అని చెప్పాడు.
యెహెజ్కేలు 9:3-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా యెహోవా–యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటములపై గురుతు వేయుమని వారికాజ్ఞాపించి
యెహెజ్కేలు 9:3-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)