యెషయా 62:6-7
యెషయా 62:6-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను. రాత్రి పగలూ వారు మౌనంగా ఉండరు. యెహోవాకు గుర్తుచేస్తూ ఉండే మీరు విరామం తీసుకోవద్దు. ఆయన యెరూషలేమును సుస్థిరం చేసే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించే వరకు ఆయన్ని వదలొద్దు.
యెషయా 62:6-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైనవారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు
యెషయా 62:6-7 పవిత్ర బైబిల్ (TERV)
కావలి ఉండుటకు యెరూషలేము గోడల మీద కావలివారిని (ప్రవక్తలను) నేను ఉంచుతాను. ఈ కావలివారు మౌనంగా ఉండరు. రాత్రింబవళ్లు వారు కనిపెట్టి ఉంటారు. యెహోవాను గూర్చి ఉపదేశించే మీరు ఎన్నటికీ మౌనంగా ఉండకూడదు. యెహోవాను ప్రార్థించటం మీరు చాలించకూడదు. మీరు ఎల్లప్పుడూ యెహోవాను ప్రార్థించాలి. ఆయన యెరూషలేమును మరల ఒక పట్టణంగా చేసేంతవరకు యెహోవాకు ప్రార్థించండి. భూమిమీద ప్రజలంతా పొగడే పట్టణంగా ఆయన యెరూషలేమును చేసేంత వరకు యెహోవాకు ప్రార్థించండి.
యెషయా 62:6-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను; పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు. యెహోవాకు మొరపెట్టే వారలారా విశ్రాంతి తీసుకోకండి, యెరూషలేమును స్థాపించే వరకు భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.