సంఖ్యాకాండము 27:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 27:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను– ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.

సంఖ్యాకాండము 27:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇంకా నువ్వు ఇశ్రాయేలీయులతో, ఇలా చెప్పు. ఒకడు కొడుకు పుట్టకుండా చనిపోతే మీరు అతని భూస్వాస్థ్యం అతని కూతుళ్ళకు వచ్చేలా చూడాలి.

సంఖ్యాకాండము 27:8 TERV (పవిత్ర బైబిల్)

“కనుక ఇశ్రాయేలు ప్రజలకు, ఇలా చట్టం తయారు చేయి. ‘ఒకనికి కుమారులు లేకుండానే అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెలకు ఇవ్వాలి.

సంఖ్యాకాండము 27:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘ఒక మనిషి చనిపోతే, అతనికి కుమారులు లేకపోతే, అతని వారసత్వం అతని కుమార్తెకు ఇవ్వాలి.