కీర్తనలు 122:6-8
కీర్తనలు 122:6-8 పవిత్ర బైబిల్ (TERV)
యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి. “యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.” నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను, శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
కీర్తనలు 122:6-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక! మీ ప్రాకారాలలో సమాధానం మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!” నా సోదరులు నా స్నేహితుల కోసం “మీలో సమాధానం ఉండును గాక” అని నేను అంటాను.
కీర్తనలు 122:6-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు. నీ సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలి. నీ పట్టణాల్లో శాంతి వర్ధిల్లుతూ ఉండాలి. మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి, అని నా సహోదరులను, నా స్నేహితులను దీవిస్తాను.
కీర్తనలు 122:6-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.