కీర్తనలు 132:4-5
కీర్తనలు 132:3-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు, యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు, నేను నా ఇంట్లోకి ప్రవేశించను, నా మంచం మీద పడుకోను, నా కళ్ళకు నిద్ర లేదా నా కనురెప్పలకు కునుకు రానివ్వను.”
కీర్తనలు 132:3-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను యెహోవా కోసం ఒక స్థలం చూసే దాకా, యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సమకూర్చేదాకా నా ఇంట్లో అడుగు పెట్టను. నా కళ్ళకు నిద్ర, నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను.
కీర్తనలు 132:4-5 పవిత్ర బైబిల్ (TERV)
నేను నిద్రపోను, నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను, యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను! ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”
కీర్తనలు 132:3-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.