కీర్తనలు 2:7-9
కీర్తనలు 2:7-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను –నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
కీర్తనలు 2:7-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా శాసనాన్ని నేను ప్రకటిస్తాను. యెహోవా నాకు ఇలా చెప్పాడు, నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను. నన్ను అడుగు. జాతులను నీకు వారసత్వంగానూ భూమిని దాని సుదూర ప్రాంతాల వరకూ నీ ఆస్తిగానూ ఇస్తాను. ఇనపదండంతో నువ్వు వాళ్ళను నలగగొడతావు, మట్టి కుండలాగా వాళ్ళను ముక్కలు చెక్కలు చేస్తావు.
కీర్తనలు 2:7-9 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను. యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను! మరియు నీవు నా కుమారుడివి. నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను. భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు! ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”
కీర్తనలు 2:7-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను. నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను. ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”