జెకర్యా 3:7
జెకర్యా 3:7 పవిత్ర బైబిల్ (TERV)
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను చెప్పిన విధంగా జీవించు. నేను చెప్పినవన్నీ చెయ్యి. నీవు నా ఆలయానికి అధికారివిగా ఉంటావు. నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు. ఇక్కడ నిలబడిన దేవదూతలవలె నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటానికి నీకు స్వేచ్ఛ ఉంది.
జెకర్యా 3:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సేనల ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే “నువ్వు నా కట్టడలను గైకొంటూ నేను నీకు అప్పగించిన కార్యం సవ్యంగా జరిగిస్తే నువ్వు నా ఆలయం మీద అధికారిగా ఉండి నా ఆవరణాలకు సంరక్షకుడివి అవుతావు. అంతేకాక, ఇక్కడ నిలబడే వారికి కలుగుతున్నట్టు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ప్రసాదిస్తాను.
జెకర్యా 3:7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా – నా మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.