1
మత్తయి సువార్త 12:36-37
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కోసం తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే. ఎందుకంటే నీ మాటలను బట్టే నీవు నిర్దోషిగా, నీ మాటలను బట్టే నీవు శిక్షకు పాత్రునిగా తీర్పును పొందుకొంటావు.”
Порівняти
Дослідити మత్తయి సువార్త 12:36-37
2
మత్తయి సువార్త 12:34
సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది.
Дослідити మత్తయి సువార్త 12:34
3
మత్తయి సువార్త 12:35
మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు.
Дослідити మత్తయి సువార్త 12:35
4
మత్తయి సువార్త 12:31
అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను.
Дослідити మత్తయి సువార్త 12:31
5
మత్తయి సువార్త 12:33
“చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది.
Дослідити మత్తయి సువార్త 12:33
Головна
Біблія
Плани
Відео