1
మత్తయి 2:11
తెలుగు సమకాలీన అనువాదము
వారు ఆ ఇంట్లోకి వెళ్లి, ఆ శిశువు తన తల్లియైన మరియతో ఉండడం చూసి, వారు వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ ధనాగారాలు విప్పి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళంను అర్పించారు.
موازنہ
تلاش మత్తయి 2:11
2
మత్తయి 2:1-2
హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు, తూర్పు దిక్కు నుండి జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు. వారు, “యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చాము” అని చెప్పారు.
تلاش మత్తయి 2:1-2
3
మత్తయి 2:10
వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు చాలా ఆనందించారు.
تلاش మత్తయి 2:10
4
మత్తయి 2:12-13
వారు వెళ్లిపోవలసిన సమయంలో హేరోదు రాజు దగ్గరకు వెళ్లకూడదని కలలో హెచ్చరిక రావడంతో వారు మరో దారిలో తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “ఈ శిశువును చంపాలని హేరోదు రాజు వెదుకుతున్నాడు కనుక నీవు శిశువును అతని తల్లిని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయి నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండు” అని చెప్పాడు.
تلاش మత్తయి 2:12-13
صفحہ اول
بائبل
مطالعاتی منصوبہ
Videos