సామెతలు 5
5
వ్యభిచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక
1నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను,
అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు,
2అప్పుడు నీవు విచక్షణ కలిగి ఉంటావు
నీ పెదవులు తెలివిని కాపాడతాయి.
3వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి,
దాని నోరు నూనె కంటే నునుపైనది;
4కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా,
రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది.
5దాని పాదాలు మరణానికి దిగుతాయి;
దాని అడుగులు నేరుగా సమాధి వైపుకు వెళ్తాయి.
6అది జీవన విధానానికి ఎటువంటి ఆలోచన ఇవ్వదు;
దాని మార్గాలు లక్ష్యం లేకుండా తిరుగుతాయి, కానీ దానికి ఆ విషయం తెలియదు.
7నా కుమారులారా, నా మాట ఆలకించండి;
నేను చెప్పే వాటినుండి ప్రక్కకు తొలగవద్దు.
8దానికి దూరంగా ఉన్న దారిలో ఉండండి,
దాని ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దు,
9పరులకు మీ వైభవాన్ని#5:9 లేదా ఒకవేళ ఇస్తే, నీవు నీ గౌరవాన్ని పోగొట్టుకుంటావు ఇవ్వవద్దు,
మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు.
10అపరిచితులు మీ సంపదను తినివేయకూడదు
మీ శ్రమ మరొకరి ఇంటిని సుసంపన్నం చేయకూడదు.
11మీ జీవితం చివరి దశలో
మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు.
12అప్పుడు మీరంటారు, “నేను క్రమశిక్షణను అసహ్యించుకోవడమేంటి!
నా హృదయం దిద్దుబాటును తిరస్కరించడమేంటి!
13నేను నా బోధకులకు లోబడలేదు,
నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు.
14సర్వసమాజం మధ్య
నేను దాదాపు పతనానికి వచ్చాను అనుకుంటూ బాధపడతారు.”
15మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి,
మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి.
16మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా?
వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా?
17వాటిని మీకు మాత్రమే చెందినవిగా ఉండనివ్వండి,
అపరిచితులతో ఎన్నడు పంచుకోవద్దు.
18నీ ఊట ఆశీర్వదించబడును గాక,
నీ యవ్వన కాలమందు నీ భార్య యందు సంతోషించు.
19ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి
ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడు తృప్తి కలుగజేయును గాక,
ఆమె ప్రేమతో నీవు ఎల్లప్పుడు మత్తులో ఉందువు గాక.
20ఎందుకు, నా కుమారుడా, మరొకని భార్యతో మత్తులో ఉంటావు?
దారితప్పిన స్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుంటావు?
21ఎందుకంటే మనుష్యుల మార్గాలు యెహోవా కళ్ళెదుట ఉన్నాయి,
ఆయన వారి మార్గాలన్నిటిని పరిశీలిస్తారు.
22దుష్టుల చెడు క్రియలు వారిని చిక్కుల్లో పెడతాయి;
వారి పాపపు త్రాళ్లు వారిని గట్టిగా బిగిస్తాయి.
23క్రమశిక్షణ లేకపోవడం వల్ల వారు చస్తారు,
వారి సొంత అతి మూర్ఖత్వం ద్వార దారి తప్పారు.
Currently Selected:
సామెతలు 5: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.