1
హెబ్రీయులకు 5:14
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.
సరిపోల్చండి
హెబ్రీయులకు 5:14 ని అన్వేషించండి
2
హెబ్రీయులకు 5:12-13
కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింప వలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారేగాని బలమైన ఆహారము తినగలవారుకారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.
హెబ్రీయులకు 5:12-13 ని అన్వేషించండి
3
హెబ్రీయులకు 5:8-9-10
ఆయన, కుమారుడైయుండియు తాను పొందినశ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
హెబ్రీయులకు 5:8-9-10 ని అన్వేషించండి
4
హెబ్రీయులకు 5:7
శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.
హెబ్రీయులకు 5:7 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు