1
ప్రకటన 12:11
తెలుగు సమకాలీన అనువాదము
వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాది మీద విజయం పొందారు; వారు చావడానికి వెనుకంజ వేయాల్సినంతగా వారు తమ ప్రాణాలను ప్రేమించలేదు.
సరిపోల్చండి
Explore ప్రకటన 12:11
2
ప్రకటన 12:10
అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యం మన దేవునివి అయ్యాయి ఆయన అభిషిక్తుని అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.
Explore ప్రకటన 12:10
3
ప్రకటన 12:9
ఆ తరువాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేక అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు.
Explore ప్రకటన 12:9
4
ప్రకటన 12:12
కనుక ఆకాశాల్లారా, వాటిలో నివసించేవారలారా ఆనందించండి! అయితే భూమికి సముద్రానికి విపత్తు! ఎందుకంటే, అపవాది మీ దగ్గరకు దిగివచ్చాడు! తనకు కొద్ది కాలమే మిగిలి ఉందని అతనికి తెలుసు కనుక అతడు తీవ్రమైన కోపంతో ఉన్నాడు” అని ప్రకటించడం నేను విన్నాను.
Explore ప్రకటన 12:12
5
ప్రకటన 12:7
అప్పడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాఘటసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా ఘటసర్పం దాని సైన్యం కూడా యుద్ధంలో పోరాడాయి.
Explore ప్రకటన 12:7
6
ప్రకటన 12:17
అందుకు ఆ ఘటసర్పం ఆ స్త్రీపై కోపంతో మండిపడి ఆమె మిగిలిన సంతానంతో అనగా నమ్మకంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతూ యేసు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్న వారితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళింది.
Explore ప్రకటన 12:17
7
ప్రకటన 12:1-2
అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్ళ క్రింద చంద్రుని, తన తల మీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది. ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది.
Explore ప్రకటన 12:1-2
8
ప్రకటన 12:5-6
ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు “ఇనుప దండాన్ని పట్టుకొని అన్ని దేశాలను పరిపాలిస్తాడు.” ఆ శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనం దగ్గరకు తీసుకొనిపోబడ్డాడు. ఆ స్త్రీ 1,260 రోజుల వరకు సంరక్షింపబడేలా దేవుడు ఆమె కొరకు ఏర్పాటు చేసిన స్థలమున్న అరణ్యంలోనికి ఆమె పారిపోయింది.
Explore ప్రకటన 12:5-6
9
ప్రకటన 12:3-4
అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి, దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది.
Explore ప్రకటన 12:3-4
10
ప్రకటన 12:14-16
ఒక కాలం కాలాలు సగకాలం వరకు సర్పానికి అందకుండా ఉండి తన ఆకలిదప్పులు తీర్చుకొనేలా అరణ్యంలో ఆమె కొరకు సిద్ధపరచిన స్థలానికి ఎగిరి వెళ్ళగలగడానికి ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి. అప్పుడు, ఆ స్త్రీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదిలా కుమ్మరించింది. కాని ఆ స్త్రీకి సహాయం చేయడానికి భూమి తన నోరు తెరిచి ఆ ఘటసర్పం నోటి నుండి వచ్చిన నదిని మ్రింగివేసింది.
Explore ప్రకటన 12:14-16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు