1
రోమా పత్రిక 10:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు.
సరిపోల్చండి
Explore రోమా పత్రిక 10:9
2
రోమా పత్రిక 10:10
అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు.
Explore రోమా పత్రిక 10:10
3
రోమా పత్రిక 10:17
కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు.
Explore రోమా పత్రిక 10:17
4
రోమా పత్రిక 10:11-13
“ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది. యూదులకు, యూదేతరులకు భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.”
Explore రోమా పత్రిక 10:11-13
5
రోమా పత్రిక 10:15
ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!” అని వ్రాయబడి ఉంది.
Explore రోమా పత్రిక 10:15
6
రోమా పత్రిక 10:14
అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు?
Explore రోమా పత్రిక 10:14
7
రోమా పత్రిక 10:4
విశ్వసించే వారందరికి నీతిగా ఉండడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నారు.
Explore రోమా పత్రిక 10:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు