అందుకు ఆమె జవాబిస్తూ, “సజీవుడు, మీ దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా దగ్గర రొట్టె ఒక్కటి కూడా లేదు, కేవలం జాడీలో పిడికెడు పిండి, కూజలో కొంచెం నూనె ఉన్నాయి. నేను కొన్ని కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్లి నాకు నా కుమారునికి చివరి వంట చేసుకుని, తిని చనిపోతాము” అని అన్నది.