1
యెషయా 45:3
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేనని నీవు తెలుసుకునేలా రహస్య స్థలాల్లో ఉంచిన నిధులను దాచబడిన ధనాన్ని నీకిస్తాను.
సరిపోల్చండి
Explore యెషయా 45:3
2
యెషయా 45:2
నేను నీకు ముందుగా వెళ్లి పర్వతాలను చదును చేస్తాను; ఇత్తడి తలుపుల్ని పగలగొట్టి, ఇనుప గడియలను విరగ్గొడతాను.
Explore యెషయా 45:2
3
యెషయా 45:5-6
నేను యెహోవాను, వేరే ఏ దేవుడు లేడు; నేను తప్ప ఏ దేవుడు లేడు. నీవు నన్ను గుర్తించకపోయినా నేను నిన్ను బలపరుస్తాను. అప్పుడు సూర్యోదయ దిక్కునుండి సూర్యాస్తమయ స్థలం వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని ప్రజలు తెలుసుకుంటారు. యెహోవాను నేనే; నేను తప్ప వేరే ఎవరూ లేడు.
Explore యెషయా 45:5-6
4
యెషయా 45:7
నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను.
Explore యెషయా 45:7
5
యెషయా 45:22
“భూమి అంచుల్లో నివసించే మీరందరు నా వైపు తిరిగి రక్షణ పొందండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.
Explore యెషయా 45:22
6
యెషయా 45:1
కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి రాజులను నిరాయుధులుగా చేయడానికి అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా తలుపులు తీయడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే
Explore యెషయా 45:1
7
యెషయా 45:23
నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని నేను నా పేరిట ప్రమాణం చేశాను. నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట ఏదీ వ్యర్థం కాదు.
Explore యెషయా 45:23
8
యెషయా 45:4
నా సేవకుడైన యాకోబు కోసం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు కోసం నేను పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నన్ను గుర్తించకపోయినా నీకు గౌరవ బిరుదు ఇచ్చాను.
Explore యెషయా 45:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు