యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు:
“జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు
బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు
ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు,
అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి:
నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని,
నేనే యెహోవానని, భూమిపై దయను,
న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని,
ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.