యోబు 34
34
1అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను
2–జ్ఞానులారా, నా మాటలు వినుడి
అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
3అంగిలి ఆహారమును రుచి చూచునట్లు
చెవి మాటలను పరీక్షించును.
4న్యాయమైనదేదో విచారించి చూతము రండి
మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి
కొందము రండి.
5–నేను నీతిమంతుడను
దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
6న్యాయవంతుడనైయుండియు నేను అబద్ధికునిగా
ఎంచబడుచున్నాను
నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని
గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
7యోబువంటి మానవుడెవడు?
అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానము
చేయుచున్నాడు.
8అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను
భక్తిహీనులకు సహవాసి ఆయెను.
9–నరులు దేవునితో సహవాసము చేయుటవారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు
చెప్పుకొనుచున్నాడు.
10విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి
దేవుడు అన్యాయము చేయుట అసంభవము.
సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము
11నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి
కిచ్చును
అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల
మిచ్చును.
12దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు
సర్వశక్తుడు న్యాయము తప్పడు.
13ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా?
ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?
14ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనినయెడల
తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనినయెడల
15శరీరులందరు ఏకముగా నశించెదరు
నరులు మరల ధూళియై పోవుదురు.
16కావున దీని విని వివేచించుము
నా మాటల నాలకింపుము.
17న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా?
న్యాయసంపన్నుడైనవానిమీద నేరము మోపుదువా?
18నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను
మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా?
19రాజులయెడల పక్షపాతము చూపనివానితోను
బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని
తోను ఆలాగు పలుకుట తగునా?
వారందరు ఆయన నిర్మించినవారు కారా?
20వారు నిమిషములో చనిపోవుదురు
మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు
బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.
21ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది
ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.
22దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు
చీకటియైనను మరణాంధకారమైననులేదు.
23ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు
బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి
అగత్యములేదు.
24విచారణలేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము
చేయుచున్నాడువారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.
25వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు
రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు
నలుగగొట్టబడుదురు.
26దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.
27ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి
ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.
28బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి
దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
29ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింపగలవాడెవడు?
ఆయన తన ముఖమును దాచుకొనినయెడల
ఆయనను చూడగలవాడెవడు?
అది అనేకులనుగూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన
దైనను ఒకటే
30భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లువారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు
లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
31ఒకడు–నేను శిక్షనొందితిని
నేను ఇకను పాపము చేయను
32నాకు తెలియనిదానిని నాకు నేర్పుము
నేను దుష్కార్యము చేసియున్నయెడల ఇకను చేయనని
దేవునితో చెప్పునా?
33నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా?
లేనియెడల నీవుందువా?
నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన
దానిని పలుకుము.
34వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు
నాతో నీలాగు పలుకుదురు–
35యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు.
అతని మాటలు బుద్ధిహీనమైనవి
36దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున
అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో
కోరుచున్నాను.
37అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు
కొనుచున్నాడు
మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు
పెంచుచున్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 34: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.