జెకర్యా 2
2
యెరూషలేమును కొలవటం
1నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్లు చూశాను. 2“నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను.
“నేను యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత వెడల్పు, ఎంత పొడవు వున్నదో చూడాలి” అని అతడు నాకు చెప్పాడు.
3అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లిపోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడటానికి వెళ్లాడు. 4అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవలేనంత పెద్దగా ఉంటుందని చెప్పు. అతనికి ఈ విషయాలు చెప్పు:
‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది.
ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతువులు నివసిస్తాయి.’
5యెహోవా చెపుతున్నాడు,
‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను.
ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.’”
దేవుడు తన ప్రజలను ఇంటికి పిలవటం
6యెహోవా చెపుతున్నాడు,
“త్వరపడు! ఉత్తర దేశం నుండి పారిపొమ్ము!
అవును. నీ ప్రజలను ప్రతి చోటికి నేను చెదర గొట్టిన మాట నిజమే.
7సీయోను ప్రజలారా! మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరంనుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నాయి.
8ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి.
కాని ఆ తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపుతాడు.
ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవుతుంది.
అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని పొందుతాయి.
9మరియు నేనా ప్రజలను బాధిస్తాను.
వారి బానిసలు వారి ధనాన్ని తీసుకుంటారు.
బబులోను ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా చేశారు.
కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను. వారు నా ప్రజలకు బానిసలవుతారు.
అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవాయే నన్ను
పంపినట్టు మీరు తెలుసుకుంటారు.
10యెహోవా చెపుతున్నాడు:
“సీయోనూ, సంతోషంగా ఉండు! ఎందుకంటే, నేను వస్తున్నాను.
మరియు నేను నీ నగరంలో నివసిస్తాను.
11ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు
నా వద్దకు వస్తారు.
పైగా వారు నా ప్రజలవుతారు.
నేను నీ నగరంలో నివసిస్తాను.”
సర్వశక్తిమంతుడైన యెహోవా నీ వద్దకు
నన్ను పంపాడని నీవు తెలుసుకుంటావు.
12యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేస్తాడు.
మరియు యూదా పవిత్ర భూమిలో తన భాగంగా ఉంటుంది.
13ప్రతి ఒక్కడూ ప్రశాంతంగా ఉండాలి!
యెహోవా తన పవిత్ర నివాసంనుండి వస్తున్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
జెకర్యా 2: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International