1 కొరింథీ 6
6
విశ్వాసుల మధ్యలోని తగాదాలు
1మీలో ఒకరితో ఒకరికి తగాదాలు ఉన్నప్పుడు, ప్రభువును నమ్మిన ప్రజలముందుకు వెళ్లడానికి బదులు భక్తిహీనులైనవారి ముందుకు న్యాయం కొరకు దాన్ని తీసుకువెళ్తారా? 2లేదా ప్రభువును నమ్మిన ప్రజలే ఈ లోకానికి న్యాయం తీర్చుతారని మీకు తెలియదా? మీరు లోకానికి తీర్పు తీర్చేవారైతే, మీలో ఉన్న అతి చిన్న తగాదాలను తీర్చుకోలేరా? 3మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ లోకసంబంధమైన విషయాలను గురించి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా! 4కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాలలో తగాదాలు ఉంటే, సంఘంలో తిరస్కరించే జీవిత విధానాన్ని కలిగినవారిని వాటిని పరిష్కరించమని అడుగుతారా? 5మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను. విశ్వాసుల మధ్య గల తగాదాలు తీర్చగల జ్ఞానవంతులు మీలో ఎవరు లేరా? 6అలా కాకుండా, ఒక సోదరుడు మరొక సోదరున్ని న్యాయస్ధానానికి తీసుకువెళ్తున్నాడు, అది కూడా అవిశ్వాసుల ముందు!
7నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారు. కనుక, మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా? 8దాని బదులు, మీరే మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మీ సహోదర సహోదరీలకు కూడా అలాగే చేస్తున్నారు. 9తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా, 10దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 11మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్ర పరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు.
లైంగిక దుర్నీతి
12“ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని” మీరు అనుకోవచ్చు కాని, అన్ని లాభకరమైనవి కావు. “ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉంది” కాని, నన్ను దేనిని లోపరచుకోనివ్వను. 13“ఆహారం కడుపు కొరకు, కడుపు ఆహారం కొరకు నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తాడు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కొరకు కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే. 14దేవుడు తన శక్తి వలన ప్రభువును మరణం నుండి సజీవంగా లేపాడు. కనుక ఆయన మనల్ని కూడ అలాగే సజీవంగా లేపుతాడు. 15మీ శరీరాలు క్రీస్తు అవయవాలై ఉన్నాయని మీకు తెలియదా? అయితే నేను క్రీస్తు అవయవాలను తీసికొని వేశ్య అవయవాలుగా చేస్తానా? అలా ఎన్నడు జరుగకూడదు. 16వేశ్యతో తనను తాను ఐక్యపరచుకొనేవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడని మీకు తెలియదా? వాక్యంలో, “వారిద్దరు ఏక శరీరమై ఉంటారు”#6:16 ఆది 2:24 అని వ్రాయబడి ఉంది కదా! 17అయితే ప్రభువుతో ఏకమైన వారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు.
18లైంగిక దుర్నీతి నుండి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్ని శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. 19మీ శరీరాన్ని దేవుడే ఇచ్చాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు, 20మీరు వెలపెట్టి కొనబడ్డారు. కనుక మీ శరీరాలతో దేవుని మహిమపరచండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 కొరింథీ 6: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.