1 థెస్సలోనికయులకు 3

3
1కాబట్టి మేము ఇంకా వేచి ఉండలేదా మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. 2మా సహోదరుడు దేవుని పరిచర్యయైన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడంలో మా తోటిపనివాడైన తిమోతిని, మీ విశ్వాసంలో మిమ్మల్ని ప్రోత్సహించి బలపరచడానికి పంపించాము, 3ఎందుకంటే, అప్పుడు మీలో ఎవరు ఏ శ్రమల వలన కలవరం చెందకుండా ఉండాలని. అయినా మనం శ్రమలను ఎదుర్కోవలసి ఉందని మీకు బాగా తెలుసు. 4నిజానికి, మనకు శ్రమలు వస్తాయని, మేము మీతో ఉన్నపుడు మీతో చెప్తూనే ఉన్నాము. అలాగే జరిగిందని మీకు తెలుసు. 5ఏదో ఒక రీతిగా శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడని, అప్పుడు మేము చేసిన పని అంతా వ్యర్థమై పోతుందని నేను భయపడ్డాను, కాబట్టి ఇక నేను వేచి ఉండలేక మీ విశ్వాసం గురించి తెలుసుకోవాలని తిమోతిని పంపించాను.
తిమోతి యొక్క ప్రోత్సాహకరమైన నివేదిక
6అయితే ఇప్పుడే తిమోతి మీ నుండి మా దగ్గరకు వచ్చి, మీ విశ్వాసం గురించి, మీరు చూపిన ప్రేమ గురించి మంచి వార్తను మాకు అందించాడు. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ మాకు సంబంధించిన మంచి జ్ఞాపకాలతో జ్ఞాపకం చేసుకుంటూ, మేము మిమ్మల్ని చూడాలని ఎలా ఆరాటపడుతున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారని అతడు మాతో చెప్పాడు. 7కాబట్టి సహోదరీ సహోదరులారా, మేము హింసించబడినప్పుడు బాధను కష్టాలను అనుభవిస్తున్న సమయంలో మీ విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు మేము ఆదరణ పొందుకున్నాము. 8ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే. 9మీ వలన దేవుని సన్నిధిలో మేము పొందిన సంతోషమంతటిని బట్టి దేవునికి మీ కోసం కృతజ్ఞతాస్తుతులు ఎంతని చెల్లించాలి? 10మిమ్మల్ని మరలా చూడాలని మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని రాత్రింబగళ్ళు మీ కోసం ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నాము.
11మన తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మేము త్వరగా మీ దగ్గరకు రావడానికి మార్గం సరాళం చేయును గాక! 12మేము మీ పట్ల ప్రేమ చూపినట్లే, విశ్వాసులైన మీరు ఒకరిపట్ల ఒకరు మీ ప్రేమను వృద్ధిపొందించుకొంటూ ఇతరులందరికి ఆ ప్రేమను అందించేలా ప్రభువు చేయును గాక. 13మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 థెస్సలోనికయులకు 3: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి