యెషయా 27
27
ఇశ్రాయేలు విడుదల
1ఆ రోజున
యెహోవా భయంకరమైన, గొప్పదైన
శక్తిగల తన ఖడ్గంతో
లెవియాథన్ అనే ఎగిరే పాము,
లెవియాథన్ అనే చుట్టుకునే పామును ఆయన శిక్షిస్తారు.
ఆయన సముద్రపు మృగాన్ని చంపుతారు.
2ఆ రోజున
“ఫలభరితమైన ద్రాక్షతోట గురించి పాడండి:
3యెహోవానైన నేను దానిని కాపాడతాను;
నేను దానికి క్రమంగా నీరు పెడతాను.
ఎవరూ దానిని పాడు చేయకుండ
రాత్రి పగలు కాపలా కాస్తాను.
4నాకు కోపం లేదు.
ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే
యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను
వాటన్నిటిని కాల్చివేస్తాను.
5ఆశ్రయం కోసం వారు నా దగ్గరకు రానివ్వండి;
వారు నాతో సమాధానపడాలి,
అవును, వారు నాతో సమాధానపడాలి.”
6రాబోయే రోజుల్లో యాకోబు వేరు పారుతుంది,
ఇశ్రాయేలు చిగురించి వికసించి
లోకమంతటిని ఫలంతో నింపుతుంది.
7ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు,
యెహోవా ఇశ్రాయేలును కొట్టారా?
ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లు
ఇశ్రాయేలును చంపరా?
8మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారు
తూర్పు నుండి బలమైన గాలి వీచినట్లు
ఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు.
9ఈ విధంగా యాకోబు అపరాధం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది,
ఇదంతా అతని పాప పరిహారానికి కలిగే సంపూర్ణ ఫలం ఇదే:
సున్నపురాయిని ముక్కలుగా నలగ్గొట్టినట్లు,
అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని చేసినప్పుడు
అషేరా స్తంభాలు కాని ధూప బలిపీఠాలు కాని
మిగిలి ఉండవు.
10బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది,
పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది.
అక్కడ దూడలు మేస్తాయి
అక్కడే అవి పడుకుంటాయి;
అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి.
11దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి
స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు.
ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు;
కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు.
వారి సృష్టికర్త వారికి దయ చూపించరు.
12ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు. 13ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 27: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.