కీర్తనలు 79
79
కీర్తన 79
ఆసాపు కీర్తన.
1ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు;
అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు,
యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు.
2వారు మీ సేవకుల కళేబరాలను
ఆకాశపక్షులకు ఆహారంగా,
మీ సొంత ప్రజల మాంసాన్ని అడవి మృగాలకు ఆహారంగా వదిలేశారు.
3వారు యెరూషలేము చుట్టూ
రక్తాన్ని నీటిలా పారబోశారు,
చనిపోయినవారిని పాతిపెట్టడానికి ఎవరూ లేరు.
4మా పొరుగువారికి మేము అసహ్యులం అయ్యాం,
మా చుట్టుపక్కల వారు మమ్మల్ని వెక్కిరించి హేళన చేస్తున్నారు.
5ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా?
ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది?
6మిమ్మల్ని గుర్తించని దేశాల మీద,
మీ పేరట మొరపెట్టని,
రాజ్యాల మీద,
మీ ఉగ్రతను కుమ్మరించండి.
7వారు యాకోబును మ్రింగివేశారు
అతని నివాసాన్ని నాశనం చేశారు.
8గత తరాల పాపాలను మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోకండి;
మీ కరుణను త్వరగా మాపై చూపండి,
ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము.
9దేవా మా రక్షకా, మీ నామ మహిమార్థమై
మాకు సాయం చేయండి;
మీ నామాన్ని బట్టి
మమ్మల్ని విడిపించి మా పాపాలను క్షమించండి.
10“వారి దేవుడు ఎక్కడ?”
అని ఇతర దేశాలు ఎందుకు అనాలి?
మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని
మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి.
11ఖైదీల నిట్టూర్పులు మీ ఎదుటకు వచ్చును గాక;
మీ బలమైన చేతితో మరణశిక్ష విధించబడిన వారిని కాపాడండి.
12ప్రభువా, మా పొరుగువారు మీమీద చూపిన ధిక్కారణకు ప్రతిగా
వారి ఒడిలోకి ఏడంతలు తిరిగి చెల్లించండి.
13అప్పుడు మీ ప్రజలు, మీరు మేపే గొర్రెలమైన మేము,
మిమ్మల్ని నిత్యం స్తుతిస్తాము;
తరతరాలకు మీ కీర్తిని ప్రకటిస్తాం.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 79: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.