యెషయా 12

12
స్తుతి పాటలు
1ఆ రోజున మీరు ఇలా అంటారు:
“యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
మీరు నాపై కోప్పడినా కూడా
మీ కోపం చల్లారింది
మీరు నన్ను ఆదరించారు.
2నిజంగా దేవుడే నా రక్షణ;
నేను భయపడను ఆయనను నమ్ముతాను.
యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ;
ఆయనే నా రక్షణ అయ్యారు.”
3మీరు రక్షణ బావులలో నుండి
ఆనందంతో నీళ్లు చేదుతారు.
4ఆ రోజున మీరు ఇలా అంటారు:
“యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;
దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి,
ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.
5యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన మహిమగల కార్యాలు చేశారు;
లోకమంతటికి ఇది తెలియాలి.
6సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి,
ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 12: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి