యిర్మీయా 24

24
రెండు గంపల అంజూర పండ్లు
1యూదారాజు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును,#24:1 హెబ్రీలో యెకొన్యా యెహోయాకీనుకు మరొక రూపం అధికారులను, నైపుణ్యం కలిగిన పనివారిని, యూదా కళాకారులను బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన తర్వాత, యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు. 2యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు.
3అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు.
“అంజూర పండ్లు, వాటిలో మంచివి చాలా బాగున్నాయి, కానీ చెడిపోయిన బాగా కుళ్లిపోయిన వాటిని మాత్రం తినలేము” అని నేను జవాబిచ్చాను.
4అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 5“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా నుండి దూరంగా బబులోనీయుల దేశానికి బందీలుగా పంపిన వారిని నేను ఈ మంచి అంజూర పండ్లలా భావిస్తున్నాను. 6వారికి మేలు కలిగేలా వారిపై నా దృష్టి పెడతాను. వారిని మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను. నేను వారిని కడతాను, కూల్చివేయను; నాటుతాను, పెరికివేయను. 7నేనే యెహోవానని నన్ను తెలుసుకునే హృదయాన్ని వారికి ఇస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను, ఎందుకంటే వారు తమ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగి వస్తారు.
8“ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. 9నేను వారిని చెదరగొట్టిన అన్ని భూరాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా, అభ్యంతరకరమైన వారిగా నిందగా, ఒక సామెతగా, ఒక శాపంగా,#24:9 అంటే, శపించడానికి వారి పేర్లు వాడబడతాయి 29:22 లేదా, ఇతరులు వారు శపించబడాలని చూస్తారు. హేళనకు కారణంగా చేస్తాను. 10నేను వారికి, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి వారు పూర్తిగా నాశనమయ్యే వరకు నేను వారి మీదికి ఖడ్గాన్ని కరువును తెగులును పంపుతాను.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 24: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి