కీర్తనలు 67
67
కీర్తన 67
ప్రధాన గాయకునికి. తంతివాద్యాలతో పాడదగినది. ఒక కీర్తన. ఒక గీతము.
1దేవుడు మామీద దయచూపి దీవించును గాక,
ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా
2తద్వార భూమి మీద మీ మార్గాలు
దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి,
3దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక;
సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.
4దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక,
ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు
భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా
5దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక;
సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.
6భూమి దాని పంటను ఇస్తుంది;
దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు.
7అవును, దేవుడు మనల్ని దీవించును గాక,
తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 67: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.