జవాబుదారీతనంనమూనా
దేవునికి జవాబుదారీతనం – సమయం, తలాంతులు మరియు సంపదలు-నేను కలిగివున్నవాటితో నేనేం చేయాలి ?
ఈ కథ ఒక యవ్వన నిర్వహణ అధికారిని గురించి చెప్పబడింది, అతడు ఒక చెట్టు క్రింద, పగటి కలలు కంటూ కూర్చున్న ఒక అబ్బాయిని చూసి, నీవెందుకు పాఠశాలకెళ్ళి చదవడం లేదని అడుగుతాడు. జవాబుగా ఆ అబ్బాయి దాని తరవాత ఏం చెయ్యాలి ? అని యవన మేనేజరుని ప్రశ్నిస్తాడు, నీవు పాఠశాల నుండి పట్టభద్రుడవుతావు, తదుపరి కళాశాలకు వెళ్లి ఒక డిగ్రీని పొందవచ్చు." ఆ యువకుడు మళ్లీ "దాని తర్వాత?" అని అడిగాడు.
నీవు ఒక ఉద్యోగం పొందగలవు గొప్పవాడివై డబ్బు సంపాదించి ధనవంతుడిగా పదవీ విరమణ చేస్తావు అని చెప్పాడు, ఈ అబ్బాయి మళ్ళీ అదే ప్రశ్న “ఆ తరవాత” ? తీరం ప్రక్కనే ఒక ఇల్లు నిర్మించి నీ ఇంట్లో చెట్టు క్రింద హాయిగా విశ్రాంతిగా గడపవచ్చు అన్నాడు, ఇతడు వెంటనే తడుముకోకుండా నేను చేసేది అదే కదా, అన్నాడు ఆ యవన మేనేజరు ఈ జవాబులకు విచారపడ్డాడు నీవు నాకు అర్ధమయ్యావు అన్నట్టు తదేకంగా అతని వంక చూసాడు.
చాల మంది క్రైస్తవులు కూడా ఇంతమట్టుకే వుంటున్నారు. అనేక కారణాలుగా ఆయా విధాలుగా యేసును తెలుసుకొంటున్నారు. ఒక్కసారి ప్రభువును అంగీకరించిన వెంటనే వెనకాల కూర్చొని కలలు కంటున్నారు మత్తయి 25 వ అధ్యాయంలో ఇట్టి వైఖరులకు ప్రభువు వ్యతిరేకంగా మాట్లాడారు. తన సేవకులకు ఇవ్వబడిన తలాంతులను వారు అభివృద్ధి చేసిన విధానంపై వారితో మాట్లాడి వారికి ఆజ్ఞ లిచ్చిన యజమానిని మనం చూస్తాం. ఈ వుపమానంలోని సేవకులకు ఆయా వనరులివ్వబడ్డాయి తమకివ్వబడిన మేరకు వారు వాటిని అభివృద్ధి చేసినపుడు ఆ ఇద్దరు సేవకులకు ఒకే రీతిగా ఆజ్ఞాపించాడు.
దేవుడు మన కిచ్చిన సమయం, సంపద, సామర్ధ్యం అనే ఈ మూడింటిని ఎలా వినియోగిస్తున్నామో మనం లెక్క చెప్పాలి. అనుదిన జీవితాల్లో మనం చాలా పని గలిగి యుంటూ దైవిక విషయాల కొరకు సమయం కలిగి వుండడానికి మనకు ఎంతో కష్టతరంగా వుంటుంది. మనం మన సమయాన్ని గడిపే విధానాన్ని చూస్తే మన జీవిత విషయాల్లో నిత్యత్వం కొరకైన ప్రాముఖ్యత / విలువ చాలా కొద్దిగా వుంటుంది. దేవుణ్ణి మహిమపరచి ఆయన రాజ్య విషయాల్లో పాలుపొందడానికి ఎంతవరకూ సుముఖంగా ఉంటున్నాం, దేవుడు మన చేతికి అప్పగించినవి మన చేతుల్లో వృధా అయిపోనిస్తున్నామా ?
ఈ రోజు తలంపు:
దేవుని చేతుల్లోని సమయంతో దేవుని సంకల్పాలతో మన సమయం మరియు తలంతులు సంబంధం గలిగివుండడం అనేది మంచి పెట్టుబడి కాగలదు.
ప్రార్ధన:
ప్రియమైన ప్రభువా నా దినాలు లెక్కించడానికి సమయ పాలనకు సహాయం చెయ్యండి నాకివ్వబడిన తలాంతులు, వరములపై అవగాహనను దయచెయ్యండి. ఈ భూమిపై నీ రాజ్యాన్ని విస్తరింప జేయుటలో వాటిని వాడడానికి నాకు సహాయం చెయ్యండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
సాధారణంగా మనుష్యులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులు దేవునికి, తమ కుటుంబాలకు, స్నేహితులకు, నాయకులకు, పనిచేసే చోట మన బృందాలకు ఆయా స్థాయిలలో మనం జవాబుదారులమై యుంటాం. అయితే సహజంగా మానవ స్వభావానికి ఈ లక్షణం అంతగా రుచించదు. దేవుని పట్ల జవాబుదారులమై యుండడం ప్రాధమికమైనదై ఇతర అన్ని కోణాలను బలపరుస్తుంది,
More
ఈ ప్రణాళికను అందించినందుకు విక్టర్ జయరాకరన్కి మేము ధన్యవాదములు కోరుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://victorjayakaran.blogspot.in/