ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా

The Final Lessons: A Holy Week Plan

10 యొక్క 1

త్యాగము

అధికారికంగా పవిత్ర వార దినములు మొదలవ్వక మునుపే మట్టల ఆదివారమునకు ముందు రోజైన ఈరోజు మనము ప్రారంభించు కొనుచున్నాము ఎందుకంటే అసలు ఈస్టర్ కథ నిజంగా ఎక్కడ ప్రారంభం అయ్యిందో దాన్ని మనం విడిచి పెట్టదలచుకోలేదు. ఆ జనములు, గాడిద, మట్టలు ఇవన్ని తరచుగా మనలను మరియ, ఆమె యొక్క త్యాగమును గమనించకుండా ఉండేలా చేస్తాయి. అందుకని మనము మట్టల ఆదివారమునకు సిద్ధపడునట్లుగా మనము శనివారముననే ప్రారంభించుకుందాము.

ఈరోజు, ఉత్తేజపరిచే జనము సంద్రం మధ్య కాక అంత కంటే ఉత్తమముగా మనలను తగ్గింపులోనికి నడిపే చోటు నుండి ప్రారంభిద్దాము. మనము సౌకర్యముగా భావించగల స్నేహితులతో కలిసి భోజనపు బల్ల యెద్ద మనము ప్రారంభించెదము.

యోహాను 12:1-8 చదవండి

యేసు యొక్క ఈ స్నేహితులను మీరు గుర్తు పట్టారా? కానట్లయితే, చిన్న ఉపోద్ఘాతం: లాజరు రోగియైనాడని, అది అతని మరణమునకు దారి తీసిందనే వార్త విన్నప్పటికీ, యేసు వారికి సహాయపడుటకు రాలేదని లాజరు యొక్క సహోదరీలు సుముఖతగా లేరు. యేసు బాధ పడినట్లు మనము చూడగలము("యేసు కన్నీరు విడిచెను", అని యోహాను11:35 మనకు తెలియజేయును) ఆ తరువాత అద్భుతము చేసెను-లాజరును మృతులలో నుండి ఆయన లేపెను!

ఈ స్నేహితులు మరణమునే కాక, పునరుత్ధానమును కూడా చూసెను. లాజరు యొక్క సహోదరీలు అప్పుడే తమ సహోదరుడు సమాధి నుండి జీవముతో బయటకు వచ్చుట చూచెను(యోహాను 11:44). అసాధ్యము సాధ్యమగుటను వారు చూసెను.

భోజనపు వేళ మరియ అసహజమైన కార్యమును చేయుటను మనము చూడగలము. "అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నరయెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను" 3 వచనములో మనము చదవగలము.

ఈ "మిక్కిలి విలువగల అత్తరు" మీరు వాడే పెర్ఫ్యుం లేక సెంట్ బాటిల్స్ వంటది కాదు. అది ఒక సంవత్సర కాలపు సంపాదన అంత విలువ ఉండవచ్చని నేను చదివిన ప్రతి వ్యాఖ్యానము లేక అధ్యయన బైబిల్ చెప్పెను.

ఒక్కసారి నీ సంవత్సర కాలపు సంపాదన ఎంతో ఆలోచించుకొనుము. ఇప్పుడు, యేసునకు ఆ మొత్తమును చెక్ మీద ఇప్పటికిప్పుడు రాసి ఇచ్చేస్తే నీకు ఎలా ఉంటుందో ఆలోచించు.

ఊహించు డానికే నాకది కష్టతరము. దేవునికి నా దశమ భాగమును లేక ఉదయాన్నే ఆయనతో 30 నిమిషములు లేక నా కుటుంబమంతా కలిసి ఆదివారపు ఆరాధన గడుపుటకే నేను కష్టపడుతూ ఉంటాను. అలాంటిది, ఒక సంవత్సరపు ఆదాయాన్ని అంతా ఇచ్చేయటమా. ఇవ్వలేను. నేను అంతదాక వెళ్ళలేను.

ఏది ఏమైనప్పటికీ, ఇలాంటి చోటనే - విలువైన దానిని తీసుకువచ్చి ("అచ్చ జటామాంసి"), తన్ను తాను తగ్గించుకొని యేసు పాదాలను తన తల వెండ్రుకలతో కడిగిన, యేసుకు సన్నిహితురాలైన, ఒక స్త్రీతో, ఈస్టర్ కథ ప్రారంభం అవుతుంది. మన సమస్తమును, మన యొక్క ఉత్తమమైన దానిని పొందుటకు క్రీస్తు అర్హుడు-మరియ దీన్ని అర్థం చేసుకుంది.

కాని తరచుగా మనమెందుకు మిగిలిపోయిన వాటినే ఆయనకు ఇస్తాము

నీకు సాధ్యమైతే, ఈ రోజును నీ మోకాళ్ళతో ముగించు. నీ చేతులను యేసు తట్టు చాపుము మరియు నీవు వేటిని బిగపట్టు కుంటున్నావో ఒప్పుకొనుము. ఇంకా ఇచ్చే వానిగా అగుటకు విశ్వాసము కొరకు అడుగుము. నీకు అవకాశమున్న దాని కంటే ఎక్కువగా ఇచ్చుటకు ధైర్యము కొరకు వేడుకొనుము.
రోజు 2

ఈ ప్రణాళిక గురించి

The Final Lessons: A Holy Week Plan

ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?

More

ఈ ప్రణాళికను అందించినందుకు సేక్రేడ్ హాలిడేస్ తో ఉన్న బేకి కిసర్ కు మా కృజ్ఞతలు. మరింత సమాచారం కొరకు www.sacredholidays.com దర్శించండి