ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా
సంతోషము మరియు సమాధానము
ఆధ్యాత్మిక క్యాలెండర్ లో ఈ రోజును మాండీ గురువారము అని చెప్పుకొందురు—యేసు తన శిష్యులతో ఆఖరిగా భోజనమునకు కూర్చున్న దినమును వేడుకగా జరుపుకునేది. ఆ భోజనపు బల్లకు కొద్ది రోజుల వ్యవధిలో ఉన్నాము.
ఆ బల్ల యెద్ద జరిగిన వాటిని గురించి మనము ఇంతకూ మునుపే చదువుకున్న వాటిని గూర్చి ఆలోచన చేయండి. వాటిల్లో నీకు ఏది ప్రాముఖ్యముగా అనిపించింది?
యేసు తన శిష్యులతో పలికిన ఆఖరి సంగతులను మరింతగా అధ్యాయనము చేయుదము రండి.
యోహాను 16:16-33 చదవండి.
పలు మార్లు యేసు యొక్క మాటలను చదువుతున్నప్పుడు నేను కూడా శిష్యులవలె ఏమియు పాలుపోని వలె అయ్యాను. ఆయన చెప్పాలనుకున్న విషయం గురించి స్పష్టత వచ్చేంతవరకు నన్ను నేను నిదానించుకొనుటకు పోరాడవలసి వచ్చెను.
ఈ వాక్యభాగామును నీవు చదువుచుండంగా యేసు చెప్పిన దాంట్లో ప్రాముఖ్యమైన ఏ రెండు విషయములు ఆయనలో మనము కనుగొనగలమని చెప్పెను?
నేను క్రైస్తవురాలిని కాకమునుపు ప్రభువు నందు మనము కనుగొనగల ఈ సంతోషము మరియు సమాధానమును గూర్చి ప్రజలు మాట్లాడుకొనుట మరియు అదేదో నా రక్షణను వారు కుదిర్చే విధముగా మాట్లాడేవారుగా నాకు జ్ఞాపకమున్నది. యేసును వెంబడించే అనేక మంది శిష్యులలో ఆ సంతోషము మరియు సమాధానమును చూసినప్పుడు - అది బలవంతముగాను: కేవలం యాంత్రికముగాను ఉండుట చేత నాకు అర్థమయ్యేది కాదు.
నేను క్రైస్తవురాలినైన పిమ్మట, అనేకమంది దీనిని ఒక ముసుగువలె తొడుగుకొనవలెనని మాత్రమే తలంచారని నేను గ్రహించగలిగాను. క్రీస్తు నందు సంతోషము మరియు సమాధానమును కలిగియుండవలెనని తెలుసుకున్న దానిని బట్టి మన ముఖములపై చిరునవ్వులతో మరియు "నేను దీవింపబడ్డాను" అనే ప్రతిస్పందనలతో పైకి అలంకరించుకుంటాము. దీనిని కలియుండడానికి ఇక్కడ పోరాడుటకు చోటే లేదు.
మనము క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుందని, శ్రమలు ఉంటాయని ఈ వాక్య భాగములో యేసు స్పష్టము చేసెను. వాటిని మనము తప్పించుకొనలేము కూడా. దీనిని గ్రహించుటలో గొప్ప స్వాతంత్రము కలదు. ఏ ఒక్కరికి అన్ని చక్కగా అమలుకావు; ఏ ఒక్కరి జీవితము పరిపూర్ణమైనది కాదు. అయినప్పటికి, మీ దుఃఖము సంతోషమగను"(20వ వచనము) మరియు "నాయందు మీకు సమాధానము కలుగును"(33వ వచనము).
మన దుఃఖము ఎలా సంతోషమగను మరియు మనమెలా సమాధానము కలిగియుందుము? (33వ వచనమును మరలా చదువుము)
ఎంత సంతోషము! ఎంత సమాధానము! తాను లోకమును జయించి యున్నానని మన విమోచకుడైన యేసు క్రీస్తు చెప్పెను గదా!
ఆయన మనకనుగ్రహించే ఆ సమాధానమును గూర్చి, యోహాను 14:27లో వివరించబడినది "సమాధానము మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా సమాధానము మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు." దేవుని సమాధానము లోకము మనకు చూపించే దానికి భిన్నముగా ఉంటుంది.పరిశుద్ధాత్ముని యందే మనము సమాధానము కలిగియుందుమని ఈ వాక్యభాగంలో యేసు చెప్పెను.
ఈ రోజున మీకు నా సవాలు ఏమిటంటే నీవు ఎదుర్కొంటున్న శోధనలో, కేవలం ఆయన యందు మాత్రమే సమాధానమును వెదుకుము. ఆయనలో సంతోషాన్ని కనుగొనుము. అది ఖచ్చితంగా దొరకును."మీ సంతోషము పరివూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును."
అని యోహాను 16:24లో యేసు చెప్పెనువాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?
More