ధాతృత్వమునమూనా

ధాతృత్వము

14 యొక్క 4

పశ్చాతాపం మరియు ధ్రాతృత్వము   

"కాలము సంపుర్ణమై యున్నది. దేవుని రాజ్యము సమీపించియున్నది. మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి."  - మార్కు 1:15

పశ్చాత్తాపము! దేని విషయంలో? యేసు చెప్పలేదు, అదే విధంగా క్రొత్త నిబంధన చెప్పలేదు. మన పాపముల విషయములో మనం పశ్చాతాపడాలనే ఉద్దేశము పాత నిబంధనలో నుండి వచ్చింది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయలు వారి దుష్టత్వము విషయములో పలుమార్లు పశ్చాత్తాపము పొందాలని చెప్పబడ్డారు. పాపముల విషయంలో పశ్చాతాపమొందడము ఒక వైపు ఉంది. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలలో నొక్కి చెప్పబడిన విషయము ఒక ఆజ్ఞ అయి ఉంది. అది - "నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు". అసలైన పశ్చాత్తాపము మననుండి కోరబడుతుంది. అదేమిటంటే ఇతర దేవుండ్ల విషయమై పశ్చాత్తాపపడి యెహోవా వైపుకు తిరగడం. మనము దేవుని వద్దకు వచ్చిన తరువాతనే మన పాపముల విషయమై పశ్చాత్తాపబడాలని చెప్పబడినాము. తద్వారా మనము ఆయనతో సరియైన సంబంధం కలిగి ఉంటాము.

"ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సన విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేను స్వయముగా వారికీ ప్రత్యుత్తర మిచ్చదను. ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను, సామెతగాను, చేసి నా జనులలో నుండి వారిని నిర్ములము   చేసెదను".  - యెహాఙ్కేలు 14:7-8. 

మనము పెట్టుకొను మరికొన్ని దేవుళ్ళు బౌతికంగా మనము చూచు విగ్రహములు కాకపోవచ్చును. అవి కంటికి కనబడని మన హృదయము యొక్క వైఖరులు కావొచ్చు. ఉదా: మత్తయి 6:24 ఏమని చెప్తుందంటే మనము దేవున్ని, ధనాన్ని సేవించలేము. ఇక్కడ మనము పశ్చాత్తాపపడాల్సిన దేవుడు (లేదా విగ్రహము) డబ్బు అయి ఉంది. డబ్బును ఆరాధించడం లేదా సేవించడము అంటే ఏమిటి? అంటే, మన అవసరతలు తీర్చేది డబ్బు అని దేవునికి బదులుగా డబ్బును నమ్ముకోవడము.   

హృదయములో ఉండే ఇతర విగ్రహలు పరపతి, విద్య మొదలగునవి. అయితే చాల శక్తివంతమైనది, చాల మంది కోరుకునేది డబ్బు. చాల మంది మనుష్యులు వారి పాపముల నుండి వారిని రక్షించిన వాడు యేసు ప్రభువు అని నమ్ముతారు. కానీ జీవితాన్ని కాపాడేది డబ్బు అని నమ్ముతారు. డబ్బు మనలను కాపాడేది, రక్షించేదని నమ్మినంత కాలము మనము త్యాగపూరితంగా ధ్రాతృత్వము చూపెట్టలేము. అంతే కాక మన క్రైస్తవ జీవితము ఉండాల్సినంత విజయవంతంగా ఉండదు.    

1 తిమోతి 6:10 ఏమని చెప్తుందంటే డబ్బుని ప్రేమించడము లేదా దాన్ని నమ్ముకోవడమనేది ప్రతి కీడుకు మూలమని చెప్తుంది. డబ్బే కాకుండా యీ లోకములోనివి ఏవైనా. డబ్బును మన జీవితానికి రక్షకమని నమ్మిన దానినుండి పశ్చాత్తాపపడకపోతే పాపము మనలను వదలదు. పాపము నుండి పశ్చాత్తాపపడడము అనేది లోకములోని వాస్తువికతను గూర్చి పశ్చాత్తాపపడడానికి దారి తీయాలి. లోకము లోని విషయాలను గూర్చి పశ్చాత్తాపపడితే  అది రక్షణకు దారి తీస్తుంది, పాపము నుండి పచ్చాత్తాపపడితే పరిశుద్ధత కలుగుటకు విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించుటకు దారి తీస్తుంది.     

ఈ లోకములని వాస్తవికతనుండి మనము పశ్చాత్తాపపడితే మనకున్న వస్తువుల పట్ల ధ్రాతృత్వముతో వ్యవహరిస్తాము. కానీ, యీ వస్తువులు మన జీవితానికి రక్షణకరమని నమ్మితే ధ్రాతృత్వంగా ఉండడానికి చాల కష్టమవుతుంది.  

నిజజీవితంలో జరిగే ప్రతిదానికి నీవు దేవున్ని నమ్ముతావా?   


వాక్యము

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

ధాతృత్వము

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి

More

ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/