ధాతృత్వమునమూనా
ధాతృత్వము గల జీవితము
"జీవించేవారు ఇకమీదట తమకొరకు కాకా, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వానికొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము." - 2 కొరింథీ 5:15
ఈ వాక్యభాగములో పౌలు ఒక మంచి వ్యాఖ్యానం చేస్తాడు. యేసు మనకొరకు మరణించాడు కాబట్టి, ఇకనూ మనకొరకు మనము బ్రతకము. కానీ, క్రీస్తు కొరకే జీవిస్తాము. ఎప్పుడైతే మనము ఇక మనకొరకు బ్రదకమో, ఎందుకు మనము పనిచేయాలి, ఎందుకు మనము వంతులు వేసుకొని పని చేయాలి దినమంతా?
కోలస్సీ 1:16 ఏమి చెప్తుందంటే, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములు, రాజ్యములు, అధికారములు అన్నీ కూడా యేసుకొరకును, యేసు ద్వారను చేయబడ్డాయి. దాని అర్ధము ఏమిటంటే, మనము చేసే పనులన్నీ, కంపెనీలు, ప్రభుత్వకార్యలయములు మరేదైనా అధికారము క్రింద ఉన్న సంస్థలు గాని, యేసు చేత చేయబడ్డాయి, ఆయన ఉద్దేశ్యాలు నెరవేర్చడానికి చేసుకోబడినాయి. మనము వాటిల్లో పని చేతున్నప్పుడు యీ అధికార నిర్మాలన్నిటి పట్ల యేసు యొక్క ఉద్దేశ్యమేమై యుందో మనము కనుక్కోవాలి.
పీటర్ డ్రక్కర్ అనే వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన విషయం చూపెట్టబడింది. అదేమిటంటే, మాస్ స్టార్వేషన్ అనే మూల్తుషియన్ ప్రవచనాన్ని ప్రపంచం నెరవేర్చ లేదు. ఎందుకంటే స్సైటిఫిక్ ఎదుగుదలల ద్వారా భూమి యొక్క ఫలము ఎక్కువయ్యింది. ఇది మనకేమి అర్ధం చేస్తుందంటే మానవుని అవసరత దేవుడు తీరుస్తాడు, వివిధ రకాలైన పనుల ద్వారా (ప్రొఫషన్స్ ద్వారా) ఆయన అది చేస్తాడు.
ఆ విషయం అట్లున్నట్లయితే, మనము పనులు చేసుకోవడానికి ఒక కారణం మానవాళి యొక్క అవసరతలు తీర్చడానికి మరియు సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. పౌలు ఏమంటాడంటే అటువంటి పనికి జీతము అవసరమని. అయితే పని వెనుకాల ఉన్న మోటివేషన్ అది కాదు. పనుల ద్వారా దేవుడు మన అవసరతలను తీరిస్తూఉంటాడు.
ఈ అవగాహనతో, మనమేమి చేస్తామంటే, మొత్తము పనుల యొక్క నిర్మాణము పంచుకొని చేసిన ధాతృత్వము. దీనిలో ఒక్కొక్క వ్యక్తి దేవుని మొత్తుముమీది ఉద్దేశ్యాలలో ఒక భాగాన్ని నెరవేరుస్తాడు. మన దగ్గరకు వచ్చు వారికి సేవ చేయడం మన గురి. సంస్థకు వెలుపల, సంస్థకు లోపల అది చేస్తాము. అది మనవృత్తి లేదా పిలుపైయుంటుంది. యీ వృత్తి ద్వారా దేవుడు మనలను పోషిస్తాడు.
ఒక వేళా మీ జీవితము ధాతృత్వముపై ఆధారపడియుందా, లేక స్వంత భద్ద్రత కొరకు మీకవసరమైనవి వెతుకుతున్నారు?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి
More
ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/