ధాతృత్వమునమూనా

ధాతృత్వము

14 యొక్క 11

ధ్రాతృత్వము చేత నింపుట (అధికారమిచ్చుట)

"భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు". - లేవీ. కా. 25:23    

పాతనిబంధన ధర్మశాస్త్రము భూమి కొనుగోలును నడిపించింది. ఏ దురదృష్టాన్ని బట్టి ఎవరు కూడా భూమిని శాశ్వతంగా పోగట్టకొనకుండా ఏర్పాటు కలిగి ఉంది. కుటుంబములో ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఎవరైనా వారి వ్యవసాయ భూమిని అమ్ముకోవాలిసివస్తే, 50 వ. సంవత్సరమైన జుబిలీ సంవత్సరములో ఆ భూమి స్వంతదారులు వశమౌతుంది. ఇదే నియమము పట్టణములోని ఇల్లు కట్టే భూమికి వర్తించదు. (VV 29,30) ఇవి ఒక సంవత్సరపులోపున విడుదల చేయబడుతాయి. దాని తరువాత అది క్రొత్త స్వంతదారునికి స్థిరముగా ఇవ్వబడుతాయి.   

వ్యవసాయ భూమి విషయములో, కొనుగోలు విషయంలో, యీ కట్టడ ఏమిటి? ఏ ఒక కుటుంభము కూడా శాశ్వతంగా బానిసలుగా ఉండనవసరములేదు.   

ఏదైనా ఒక కుటుంభము వారి భూమిని అమ్మితే, తిరిగి దాన్ని కొనుక్కొనుటకు సంపాదించడానికి ఇంకా దారి లేదు. భూమిలేని కూలివండ్రుగా, ఇతరుల భూమిపైన పని చెయ్యాలి. భూమి లేకుండా వారు యీ పరిస్థితి నుండి బయట పడరు. ఈ పరిస్థితి కొనసాగితే, కొన్ని కుటుంభాలు మాత్రమే భూమిని కలిగి ఉంటారు, మిగితా వారంతా కూలివాండ్రుగా ఉంటారు. అందుకని యీ ధర్మశాస్త్ర కట్టడ ప్రకారము, కొంత కాలమైన తరువాత తిరిగి వారు తమ భూమిని పొంది స్వతంత్రులుగా ఉంటారు.   

దేవుడెలా నియమించాడంటే, సంపాదనకు మూలమైనవి ఏవికూడా ఒక కుటుంభములో లేకుండా ఉండకూడదు. అన్ని కుటుంభాలు కూడా గౌరవంగాను, గంబిరంగాను ఉండగలగాలి.  

ఈ రోజుల్లో, సంపాదనకు మూలము జ్ఞానమైయ్యింది ముఖ్యమైన విషయమేమిటంటే, మనము దేవుని విలువలు యందు నమ్మికయుంచినట్లైతే, ప్రతికుటంభము అవసరమైనంతగా విద్యాభ్యసము చేయడానికి హక్కు కలిగి యుండేటట్లు చూడాలి. ఇది చాల ప్రభుత్వాల చేత గుర్తింపబడుతుంది. చట్టాలు ఏర్పర్చబడ్డాయి. అందరికి విద్య అందుబాటులో ఉండాలని. చాల దేశాలలో ఇది ప్రవేశపెట్టబడింది, భారతదేశములో గూడ.   

గతంలో సార్వత్రిక సంఘము ప్రజలకు విద్యనభ్యసించునట్లు చేయుటలో నాయకత్వం తీసుకొంది. అయితే ఈ రోజుల్లో పరిస్థితి చాల వేరుగా ఉంది. ఈ క్రొత్త పరిస్థితులలో, సంఘము అందులోని సభ్యులు విద్యనభ్యసించుటకు అవకాశం కలిగి ఉండేటట్లుగా చూడాలి. సంఘము చేయాల్సిన సాంఘిక సేవలలో ఒకటి బీదవారు చదువుకొనుటకు అవకాశం కలిగి యుండేటట్లు సహాయం చేయాలి.  

గత సంవత్సరములో నీ చేత సంపాదించడానికి కారకాలు ఎంతమంది పొందియున్నారు?    


రోజు 10రోజు 12

ఈ ప్రణాళిక గురించి

ధాతృత్వము

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి

More

ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/