ధాతృత్వమునమూనా
ధాతృత్వముతో అప్పిచ్చుట
''ఏడావ సంవత్సరమున విడుదల ఇయ్యవలెను''. - ద్వితీ. కా. 15:1-11
చాలా కాలంగా క్రైస్తవ సమాజము డబ్బును వడ్డీకి ఇవ్వకూడదనే బైబిలోని ఆజ్ఞేలు తప్పుగా అవగాహనా చేసుకున్నట్టుగా చూస్తాము. ఇది యూదుల వ్యాపారానికి దెబ్బ తీసింది. బైబిలును తప్పుగా అర్ధం చేసికోవడాం వలననే ఇది జరిగింది. కేవలము పేదవారికి, అవసరాలలో ఉన్నవారికి ఎవరైతే ఆర్థిక ఇబందులలో ఉన్నవారికి వడ్డీకి డబ్బు ఇవ్వకూదని చెప్పబడింది.
పాతనిబంధన పేదలకు అప్పు ఇచ్చే ధనికులకు ఒక విషయం ఖచ్చితం చేసింది. అదేమిటంటే డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదని. వారి ఆర్ధిక భారాన్ని ఇంకా ఎక్కువ చేయకూడదని చెప్తుంది. ఈ అప్పులు వడ్డీలు లేకుండా ఉండాలి. పేదలకిచ్చే ధనము పైన ఎటువంటి లాభాలు తీసుకోకూడదని చెప్పుతుంది (లేవీ. కా. 25:35-37).
బైబిలు సోమరితనానికి, పనిచేయుటకు అయిష్టత చూపే విషయానికి వ్యతిరేకంగా బోధిస్తుంది. కాబట్టి పేద వారు కాదుగాని, దురదృష్టానికి లోనయినవారై ఉండాలి.
వారు అప్పుతీర్చలేక పొతే ఏమి చేయాలి? బైబిలు యీ అప్పుల విషయమేమిటి చెప్తుందంటే జూబిలీ సంవత్సరములో వాటిని కోట్టివేయాలి. అది ప్రతి ఏడు సంవ్సతరముల కొకసారి జరుగుతుంది. ఏడవ సంవ్సతరము జూబిలీ సంవ్సతరము కాబట్టి జూబిలీ సవత్సరానికి దగరలో పేదలకు అప్పు దొరుకుట కష్టము ద్వి తీ. 15:9-10 యీ విషయానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది.
మీ హృదయములలో యీ దుష్ఠలోచన రావొచ్చు, జాగ్రత్తగా ఉండండి అదేమిటంటే " ఏడవ సంవత్సరము విడుదల సంవత్సరం దగ్గరలో ఉంది. నీ పెద సహోదరుని పట్ల నీ చూపు చేడుగా ఉండడం వలన అప్పు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవచ్చు. అతడు నిన్ను గూర్చి దేవునికి మొఱ్ఱపెడ్తాడు. అది మీ పట్ల పాపంగా పరిగణింప బడుతుంది. మీరు అతనికి ఇవ్వాలి. వానికి ఇచ్చుట విషయములో నీ మనసులో దుఃఖముండరాదు. ఎందుకంటే యీ విషయంలో దేవుడు నీ పనులన్నిటిలో నీవు చేయి పెట్టిన ప్రతిదాంట్లో నిన్నాశీర్వదించును.
బైబిలు ధనవంతులకు ఏమి చెప్తుందంటే స్వేచ్ఛగా అప్పులు ఇవ్వాలని. అవి తిరిగి వారికి ఇవ్వబడవనే విషయాన్నీ పూర్తిగా తెలుసుకొని ఉండాలి.
ఈ రోజు మనలో చాల మందికి మన చుట్టూ ఉన్న పేదవారి నుండి, అప్పుకావాలనే అర్ధింపులు రావొచ్చు. ఈ అభ్యర్ధనలకు మనమేవిధంగా స్పందిస్తాము? బైబిలు ఒకవైపు బాధ్యతారహితమైన జీవితాన్ని ప్రోత్సాహించదు (థెస్స. 3:10), మరొకవైపు మనలను పేదల పట్ల ధ్రాతృత్వముతో, కనికరముతో ఉండాలని అడుగుతుంది. మరలా మరలా అప్పు ఇవ్వమంటుంది వారు ఇవ్వకపోయినా.
మిమ్మును అప్పు అడిగి తిరిగి చెల్లించిన వారి పట్ల మీరు బాధపెట్టుకొని యున్నారు?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి
More
ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/