దుఃఖమును నిర్వహించుటనమూనా
దేవుడుఇంకాసింహాసనంపైఉన్నాడు
ఊహించని విధంగా మరణం సంభవించినప్పుడు, ఉదాహరణకు ఆకస్మిక ప్రమాదంలో లేదా చిన్న పిల్లవాడు అకస్మాత్తుగా మరణించిన సందర్భాల్లో, ఈ విధంగా జరిగియుండాల్సింది కాదు. విధి యొక్క ఆకస్మిక దాడిలో మేము విలవిలలాడుతున్నాము అనే భావన ఎల్లప్పుడూ ఉంటుంది. మనకు ప్రాణాంతకమైన అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు మరియు సమయానికి సంబంధించిన రోగనిర్ధారణ అందించబడినప్పుడు, మనకు తగినంత హెచ్చరిక లేదా సిద్ధపాటుసమయాన్ని ఆయన అందించనందున, దేవుడు కూడా ఆశ్చర్యపోయినట్లు ఈ అనుభూతి కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. .
కానీ జీవితం మరియు మరణంపై దేవుడు పూర్తిగా సార్వభౌమాధికారి అని బైబిల్ మనకు హామీ ఇస్తుంది.ఆయనఅకస్మాత్తుగా ఒక పరిస్థితిలోపట్టబడలేదు , ఆయన ఎప్పుడూ ఒక పరిస్థితిని బట్టి ఆశ్చర్యపోలేదు .దేవుడు ప్రతి విషయాన్ని అతి సూక్ష్మమైన వివరాలతో సహానిర్దేశిస్తాడు. ఆకస్మిక నష్టంతో తలతిరుగుతున్న దెబ్బతోకొట్టుమిట్టాడుతున్న హృదయానికి శాంతి మరియు విశ్రాంతిని అందించే సత్యం ఇది.
మత్తయి 10:29-31లో“ రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా: అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదుఁ.
ఇది విలువైన మరియు లోతైన వాస్తవికత, ఇది దుఃఖిస్తున్న హృదయాన్ని ప్రభావితం చేయాలి.
జె.సి. రైల్ఇలా వ్రాశాడు నిమన ప్రభువు అడుగుజాడల్లో నడుస్తూఈ విధంగా చెప్పగలిగే వ్యక్తి సంతోషంగా ఉంటాడు , నినాకు ఏది మంచిదో అది నాకు లభిస్తుంది. నా పని పూర్తయ్యే వరకు నేను భూమిపై జీవిస్తాను మరియు ఒక్క క్షణం కూడాఎక్కువ జీవించను . నేను పరలోకమునకువెళ్లే సమయమువచ్చినప్పుడు నేను తీసుకోబడతాను మరియు ఒక క్షణం ముందు కాదు. దేవుడు అనుమతించే వరకు ప్రపంచంలోని అన్ని శక్తులు నా ప్రాణాన్ని తీసివేయలేవు. దేవుడు నన్నుపిలిచినప్పుడు భూమిపై ఉన్న వైద్యులందరూ దానిని భద్రపరచలేరు.
లాజరస్ విషయానికొస్తే, బైబిల్ ఇలా చెబుతోంది “ఇది విన్నప్పుడు, యేసు ఇలా అన్నాడు, “ఈ అనారోగ్యం మరణంతో ముగియదు. లేదు, ఇది దేవుని మహిమ కోసం, తద్వారా దేవుని కుమారుడు దాని ద్వారా మహిమపరచబడతాడు.”
దేవుడు మీ ప్రత్యేక అవసరత కొరకు మీ ప్రార్థనకు అవును అని చెప్పడానికి మరియు తన మహిమను మీకు చూపించడానికి మీ ప్రార్థనకు అవును అని చెప్పడం మధ్య వ్యత్యాసం ఉంది. యేసు వాగ్దానంపై మనకున్న విశ్వాసం అంటే దేవుడు మన బాధను ఎలా ఉపయోగించుకున్నాడో మనం ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటామని మనం నిశ్చయించుకోవచ్చు.
జీవితం బాధను విడిచిపెట్టదు, కానీ యేసు శ్రద్ధ వహించడాన్ని కూడా విడిచిపెట్టడు. మీరు ఆయనను విశ్వసిస్తే, ఆయన తన మహిమను మీకు చూపిస్తాడు.మరణం అంతం కాదని గుర్తుంచుకోండి.చావు అర్థరహితం కాదని, ఈ విషాదంలో అర్థం ఉండవచ్చని కూడా గుర్తుంచుకోండి.
నాస్తిక విశ్వాసం యొక్క విషాదం ఏమిటంటే, ప్రతిదీ అంతిమంగా నిష్పాక్షికంగా అర్థరహితం. మరణం అంతిమ విషాదం అవుతుంది, ఎందుకంటే ఇది జీవితానికి చివరి ముగింపు. కానీ మన హృదయాలు దానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. విషాదంలో కూడా అర్థం ఉండాలని మనముకోరుకుంటున్నాము.సువార్తలో ఈ అర్ధంఉంది.
రోమీయులు 8:28 మనకు వాగ్దానం చేస్తుంది .నిదేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.”
దేవుడు ఇంకా సింహాసనంపై ఉన్నాడని మరియు మీ మంచి రోజులు ఇంకా ముందుకు ఉన్నాయని, అర్థం మరియు ప్రాముఖ్యతతో నిండిన రోజులు, ఇతరులకు సహాయం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి మీరు ఆయననుఅనుమతించినందున, దేవుడుఈ భక్తిని ఉపయోగించుకుంటాడు. ఆ మహిమ కోసం జీవించడం ఎంతో యోగ్యమైనది.
ఉల్లేఖనము: “దేవుడు మన ఆనందాలలో మనతో గుసగుసలాడతాడు, మన మనస్సాక్షితో మాట్లాడుతాడు, కానీ మన శ్రమలలో అరుస్తాడు: ఇది చెవిటి ప్రపంచాన్ని లేపడానికి ఆయన యొక్కమెగాఫోన్.” సి.ఎస్.లూయిస్
ప్రార్థన: ప్రభూ,నా ప్రియమైన వ్యక్తిని కోల్పోయినా కూడామీరు ఇంకా సింహాసనంపై ఉన్నందుకు వందనములు.మీరు మీ నామమును మహిమ పరచుకుంటారు మరియు నా జీవితమును అందంగా తీర్చి దిద్దుతారు, ఆమేన్ .
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మనం ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు, మనం తరచూ అనేక రకాల భావోద్వేగాలను అనుభవిస్తాము. ఈ 10-రోజుల భక్తిసంబంధమైన ధ్యానములలో , మన ప్రియమైనవారు దేవునితో ఉండడానికి వెళ్ళినప్పుడు దుఃఖాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి. జూన్ 2021 చివరిలో ప్రభువుతో కలిసి ఉండటానికి నా ప్రియమైన భార్య పరలోక గృహమునకు వెళ్లిన తర్వాత ప్రభువు నాకు బోధిస్తున్న పాఠాలు ఇవి.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము విజయ్ తంగయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.facebook.com/ThangiahVijay