లోపల మరియు వెలుపల స్వస్థత!నమూనా

 లోపల మరియు వెలుపల స్వస్థత!

7 యొక్క 2

యెహోవా రాఫా: స్వస్థపరచు దేవుడు

పురాతన ఐగుప్తు నుండి వచ్చిన తొలి గ్రంథపు చుట్టలు అధిక సంఖ్యలో ఔషధ నివారణలు, మంత్రోచ్చారణములు కనుగొనబడ్డాయని నమోదు చేసాయి, స్వస్థపరచేవారు, వైద్యులు వాటి మీదప్రయోగాలను చేసారు. కాబట్టి మోషేతో కలిసి ఐగుప్తును విడిచిపెట్టిన ఇశ్రాయేలీయులకు,430 సంవత్సరాలుగా దేశంలో నివసించినందున ఈ నివారణలు మరియు చికిత్సలన్నింటితోను బహుశా పరిచయం కలిగియున్నారు. దేవుని గురించి వారి అవగాహన ఇప్పటి వరకు వినికిడిలోనే ఉంది. కాబట్టి వారు ఆయన శక్తి, మరియు సన్నిధి యొక్క మహిమను ఇంకా తెలుసుకోలేదు లేదా అనుభవించలేదు.

అధికారంతో ఉన్న మోషేతో ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం యెదుట ఎర్ర సముద్రం అత్యద్భుతంగా చీలిపోవడం నిర్గమకాండము 15 అధ్యాయానికి ఉన్న నేపథ్యం. ఈ అద్భుతమైన క్షణం తర్వాత వారు మారా చేదు నీళ్ల వద్దకు వచ్చినప్పుడు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. వారి గొణుగుడు మరియు సణుగుళ్ళకు ప్రతిస్పందనగా మోషే వారి యెదుట ఒక షరతుతో ఒక వాగ్దానాన్ని ఉంచాడు. మనుష్యులు దేవుని స్వరాన్ని విని, ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపిస్తూ ఆయన ఎదుట సరైన దానిని చేసినట్లయితే, ఐగుప్తీయులను బాధపెట్టిన రోగాలను ఆయన వారి మీదకు రానియ్యడని మోషే వారికి చెప్పాడు. ఈ దేవుడు ఎవరు అనే ధృవీకరణతో అతడు తన ఆజ్ఞను ముగించాడు: "నేను స్వస్థపరచు ప్రభువును." అద్భుతం!

ఐగుప్తు వారు యెరిగిన స్వస్థతలు మరియు చికిత్సలు ప్రాముఖ్యం కాదనీ, వారిని స్వస్థపరిచేది దేవుడే అని మోషే నొక్కి చెప్పాడు. దేవుడు వారిని స్వస్థపరచడం మరియు రక్షించే మార్గాన్ని ఎంచుకొన్నట్లయితే చుట్టుపక్కల దేశాల వారి నుండి వారిని ప్రత్యేకమైన వారిగా చేస్తాడు.

ఈనాడు, ప్రభువైన యేసును ప్రేమించేవారిమిగా, మనం ఆయన స్వరానికీ, నాయకత్వానికీ విధేయత చూపే జీవితాన్ని ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా మన ఎంపిక, అయితే మన విధేయత యొక్క ప్రతిఫలాలు మోషే మరియు యెహోషువా కాలంలో వలె ఇప్పటికీ కార్యాన్ని జరిగిస్తాయి. మనం రోగాలకు నిరోధకతను కలిగి యుండకపోయినట్లయితే, విచ్చిన్నమైన లోకంలో జీవిస్తున్నప్పుడు, దేవుడు వాటి ద్వారా మనలను నడిపిస్తాడనీ, అవసరత కలిగినప్పుడు ఆయన మనలను మోసుకెళ్తాడని మరియు సురక్షితంగా మనలను ఆవలి వైపుకు తీసుకొని వెళ్తాడని మనం నిశ్చయత కలిగి యుండవచ్చు.

మీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి, స్వస్థతను గురించి సుప్రసిద్ధ సంస్కృతులు చెప్పే వాటిని అనుమతించవద్దు. మీ మొదటి ఎంపిక ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మీ మోకాళ్ల మీద ఉండడం, మీ పరలోకపు తండ్రితో మాట్లాడడం, మరియు మార్గదర్శకత్వం కోసం ఆయన కోసం వేచి ఉండడం మీ ప్రప్రధమమైన ఎంపికగా ఉండును గాక!

ఏ నివారణగానీ లేదా చికిత్స గానీ లోతైన స్వస్థతను తీసుకొని రాదు. భూసంబంధంగా స్వస్థతలు చేసేవారు గానీ లేదా వైద్యులు గానీ మన ఆత్మకూ మరియు మన మనసుకూ స్వస్థతను తీసుకురాలేరు.

ఏ చికిత్స గానీ లేదా జీవనశైలి లేదా ఆహార ప్రణాళికలూ అవి ఎంత ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, అవి మన జీవితాలకు సంపూర్ణతను తీసుకురావు. నిజమే, శాశ్వతమైన, జీవితాన్ని మార్చివేసే స్వస్థత కేవలం ప్రభువైన యేసు నుండి మాత్రమే వస్తుంది!

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

 లోపల మరియు వెలుపల స్వస్థత!

ఈ అంశం మీద మనకు ప్రతిదీ తెలియకపోయినా,భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు పరిచర్యలో అధిక భాగం స్వస్థతతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు ఈ బైబిలు ప్రణాళికను చదువుతూ ఉండగా,ఒక లోతైన మరియు సంపూర్ణమైన విధానంలో మీరు స్వస్థతను పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. కేవలం అత్యంత గొప్ప వైద్యుడు మాత్రమే తీసుకురాగల స్వస్థత.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.christinegershom.com/