కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికినమూనా
అర్థంచేసుకొనవలసిన దైవజ్ఞానం
నేనొకసారి విందుసమయంలో హాంగ్ కాంగ్ నుండి వచ్చిన సంఘకాపరుల బృందాన్ని కలుసుకున్నాను. గృహసంఘంలో ఆరాధన జరిగేసమయంలో ఇంటిమీదకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాధికారులు దాడిచేసి నప్పుడు సంఘం ఎలా తప్పించుకొనడం జరిగిందో గృహసంఘకాపరి చెప్పారు. అతని భార్య అక్కడున్న వారందరినీ అక్కడ నుండి పంపించివేసి, తానే సంఘకాపరినని అధికారులతో చెప్పడం జరిగింది. వారు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి రెండు రోజులపాటు ఆమెను కొట్టడం జరిగింది.
నాలో కోపావేశాలు పెల్లుబికాయి. నా భార్యకే గనక అలా ఎవరైనా చేసినట్లయితే నేనెలా స్పందించి ఉండే వాడిని? “మనం దేవునికొరకు శ్రమపడడానికి ఆయన మనల్ని యోగ్యులుగా లెక్కించగలడని మీరు ఊహించగలరా” అని చెబ్తూ ఆ సంఘకాపరి ఆ వృత్తాంతాన్ని ముగించారు.
శ్రమపట్ల మనమెలా స్పందిస్తున్నామనేది మన దైవజ్ఞానంగురించి దేవుని స్వభావంగురించి ఆయన మన జీవితాల్లో చేస్తున్నవాటిగురించి మన ఆలోచనలెలా ఉన్నాయో తెలియజేస్తుంది. మనం ధైర్యంకోల్పోయి నిరుత్సాహపడుతున్నట్లయితే బహుశా మీ దృక్పథం సరైనది కాదేమో.
శత్రువుకున్న బలమైన ఆయుధాల్లో ఒకటి మనలో ఉన్న అధైర్యం లేదా నిరుత్సాహం. ఇది మన నమ్మికను హరింపజేసి, మన పరిస్థితి ఇక ఎప్పటికీ మారదని మనం అనుకొనేలా మనం ధైర్యం కోల్పోయేలా చేస్తుంది. ఇక ప్రయత్నించడమేముంటుంది? ఇటువంటి మనస్తత్వం రాజీపడేలా చేస్తుంది, ఇక విడిచిపెట్టడమొకటే నిజమైన ఎంపిక అనుకొనేలా చేస్తుంది.
అయితే ఇందుకు భిన్నంగా దేవుడు మనకు దైవజ్ఞానాన్నిస్తున్నాడు – ఇది ఆయన మనల్నెంతగా ప్రేమిస్తున్నాడో, మన భవిష్యత్తును తన అరచేతుల్లో ఎలా పెట్టుకున్నాడో తెలిపే దైవిక దృక్పథం. ఈ దృక్పథం మనలో నిశ్చలమై ఉన్నప్పుడు నిరుత్సాహం దాని శక్తిని కోల్పోతుంది.
నేడు మీలో నిరుత్సాహమున్నదా? దైవిక దృక్పథాన్ని పొందండి. ఈ క్రిందివాటిగురించి ఆయన దైవజ్ఞానాన్ని పొందండి.
·మీ పరిస్థితులు:
విశ్వాస నేత్రాలతో మీ పరిస్థితుల్ని చూడండి. ఇవి మీరు దేవునిమీద ఆధారపడేలా చేస్తున్నాయి, దేవునిమీద ఆధారపడడం ప్రస్తుతానికీ నిత్యత్వానికీ అమూల్యమైన సామర్థ్యం.
·మీ భవిష్యత్తు:
నిరీక్షణ నేత్రాలతోమీ భవిష్యత్తును చూడండి. మీరు యేసును విశ్వసించినవారైతే మీరు శ్రమపడడానికి యోగ్యంకాని పరిస్థితుల్లోకి మీరు వెళ్లనే వెళ్లరు.
·మీ ప్రేరణ:
దేవుణ్ణి ప్రేమించేవారికి జీవకిరీటం వాగ్దానం చేయబడింది, ఇదే మన దర్శనాన్ని నిత్యత్వానికి లంగరు వేసే బలమైన ప్రేరణ.
నేడు “యాకోబు” పత్రికలోని వాక్యభాగాన్ని ధ్యానించి, దేవుడనుగ్రహించే వనరులకొరకు ఆయనను ధైర్యంగా అడగండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ లోకంలోని జీవితం కష్టాలతో నిండి ఉంది. బహుశా మీరు ఇప్పుడు కూడా ఏదైనా శ్రమలోనే ఉండి “ఎందుకు” అని గానీ, లేదా “దీనిలోనుండి నేనెలా బయటపడగలను” అని గానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించు కుంటున్నారేమో. ఈ ప్రశ్నలకు “యాకోబు” పత్రికలో జవాబులున్నాయి! కల్లోలం నిండిన కాలంలో నిలిచే వారుగా ఉండడానికి అవలంబించవలసిన వైఖరి, వనరు, మరియు దైవజ్ఞానం ను సంపాదించుకొనడంద్వారా కష్టసమయాల నడుమ దేవుని ఆనందాన్ని మీరెలా అనుభవించగలరో చిప్ ఇన్ గ్రామ్ ఈ 5-రోజుల పఠన ప్రణాళికలో తెలియజేస్తున్నారు.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/product/art-of-survival-book/