మీ అత్యుత్తమ పెట్టుబడి!నమూనా
“దేవుని సూత్రాలను అనుదినం అన్వయించుకోండి”
“నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” కీర్తనలు 119:105
క్రైస్తవులకు, కొన్నిసార్లు అంధకారంలో ఉన్న లోకంలో వెలుగునిచ్చే శక్తిని దేవుని వాక్యం అందిస్తుంది. దేవుని వాక్యంలోని సత్యానికి మనం సుముఖత చూపి, మన జీవితంలో లోతుల్లోనికి కూరుకుపోయా విధంగా దానికి అనుమతినిస్తేనే అది వెలిగునకు మూలంగా ఉండగలదు. మత్తయి సువార్తలో మనకు కనిపించే ఒక ఉపమానంలో యేసు దీనిని వివరిస్తాడు:
“ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా – ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను.” మత్తయి 13:3-8
ఈ కథలోని విత్తనం బైబిలుకు సూచన ఉంది మరియు నెల యొక్క వివిధ స్థితులు దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఎంత సిద్ధంగా మరియు ఇష్టంగా ఉన్నామో అన్నదానికి సూచన ఉంది. వ్యవసాయదారుడు విత్తిన విత్తనాలన్నీ అతడు ఆశించిన ఫలితాన్ని తేలేకపోయాయి; కేవలం మంచి నెల మీద విత్తబడిన విత్తనాలు మాత్రమే మంచి ఫలితాన్ని ఇచ్చాయి. యేసు ఈ కథకు ఇచ్చిన వివరణ కోసం మత్తయి 13:18-23 చదవండి. మన జీవితంలో “మంచి నెలగా” దున్నబడుట అంటే మన ఆలోచనాల్లోనికి దేవుని వాక్యం మన ఉద్దేశాలు మరియు ప్రవర్తనను ప్రభావితం చేయగలుగునట్లు దానికి మనం అనుమతినివ్వడమే.
“ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.” హెబ్రీయులకు 4:12
అంతేకాకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి దానిని ప్రభావవంతంగా అన్వయించుకోవటమే కేంద్రమై వుంటుంది:
“మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.” యాకోబు 1:22
దేవుని వాక్యాన్ని మన ఆలోచనాల్లోనికి చొచ్చుకొని పోనిచ్చుట మరియు మన మనస్సాక్షిని రూపించబడనీయుట ద్వారా అనుదినం మనం చేసుకునే నిర్ణయాలు చేసుకొనుటలో మన ఉద్దేశాలు మరియు ప్రవర్తనను ప్రభావవంతంగా పరీక్షించుకోగలుగుతాము. మనం అలా చేసినప్పుడు, ఆయన వాక్యం మన జీవితానికి అత్యంత ప్రభావవంతమైన మార్గదర్శిగా మారుతుంది.
“అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.” యాకోబు 1:25
మీ జీవితంలో దేవుని వాక్యమనే విత్తనాన్ని విత్తుకొనటానికి మిమ్మును మీరు పురికొల్పుకోండి; అనుదినము దానిని చదవటానికి, అర్థంచేసుకొనటానికి మరియు అన్వయించుకొనటానికి. ఒక సమృద్ధియైన ఆశీర్వాదం మీకొరకు ఎదురుచూచ్తుంది!
ఈ ప్రణాళిక గురించి
ఆశీర్వాదకరమైన మరియు సమృద్ధియైన రాబడి పొందాలంటే సరైన విధానంలో పెట్టుబడి పెట్టాలి. మీరు నూతన క్రైస్తవులైతే, దేవుని వాక్యం అనుదినం ధ్యానించడానికి మించిన గొప్ప పెట్టుబడి మరేది ఉండదు. మీరు చదువుకొనటానికి, దానిని అర్థం చేసుకొని ప్రభావవంతంగా పాటించటానికి మీకు సహాయం చేయునట్లు ఇక్కడ ప్రారంభించండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te