ఆదేశంనమూనా

ఆదేశం

3 యొక్క 2

వెళ్లడానికి ఆదేశించబడ్డాం … అయితే నేను ఎక్కడికి వెళ్లాలి?

ప్రధాన ఆదేశాన్ని నెరవేర్చడం ఒక పెద్ద ప్రయత్నం అని, అందుకొరకు సుదూర ప్రాంతాలకు

వెళ్లడం అవసరమని మనం తరచుగా ఆలోచిస్తుంటాం. ఇది కొంతమేరకు నిజమే కావచ్చు,

మనలో చాలామందికి పరిచర్య మనం ఉన్న చోటనే ఉంటుంది, మన చుట్టుప్రక్కలలోనే

ఉంటుంది.

దేవుని రాజ్యాన్ని ప్రకటించడంకొరకు పిలుపు మనం ఇల్లు అని పిలిచే మన

చుట్టుప్రక్కలలోనే, మన అనుదిన సంభాషణలలోనే, ప్రతి రోజూ వ్యక్తిగత స్థాయిలో మనం

స్పర్శించే జీవితాలలోనే ప్రతిధ్వనిస్తుంది.

సర్వలోకం మన పరిచర్య పొలం, అయితే దానిని కనుగొనడానికి మనం శ్రమతో కూడిన

ప్రయాణాలు చేయవలసిన అవసరం లేదు.

ఇప్పుడు మనం ఎక్కడున్నామో అదే మన పరిచర్య స్థలం కావచ్చు.

సామాన్యమైన ప్రతి క్షణం రాజ్యసంఘట్టనంకొరకు అసాధారణమైన శక్తిని కలిగి ఉందనే

సత్యాన్ని అంగీకరించండి.

మన ఇంటివాకిలి బయటనే, మనం ప్రతి రోజూ చూచే పరిచయమైన ముఖాలలోనే పరిచర్య

మనకొరకు ఎదురుచూస్తూ ఉంది.

మనం ఉన్న చోటనే యేసును ప్రకటించడంకొరకు పొంగిపొరలే ప్రేమతో, పరిశుద్ధాత్మ నడి

పింపుతో, విశ్వాసంతో అడుగు ముందుకు వేయండి.

2 కొరింథీ 5:20

“కావున దేవుడు మాద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై…”

ప్రతి ఒక్కరితోను, ప్రతి దేశంలోను, ప్రతి గృహంలోను క్రీస్తు ప్రేమను సత్యాన్ని

పంచుకొనడానికి మనం ఆదేశించబడ్డాం. గాఢాసక్తితోను లక్ష్యంతోను మనం ఈ ఆదేశానికి

ప్రతిస్పందిద్దాం. మనం ఈ ప్రధాన ఆదేశాన్ని నెరవేరుస్తుండగా, రక్షణనిచ్చే దేవుని

నిత్యప్రణాళికలోను ప్రపంచ పరివర్తనలోను ప్రేమతో భాగస్వాములమవుదాం.

Day 1Day 3

ఈ ప్రణాళిక గురించి

ఆదేశం

“ఆదేశం” బైబిల్‌ ప్రణాళికకు స్వాగతం, ఇది క్రీస్తుయొక్క శిష్యులు వెళ్లి ఆయన ప్రేమను అందరికి తెలియజేయాలని ప్రతి శిష్యుడికి ఇవ్వబడిన దైవికమైన ధర్మవిధి యొక్క అన్వేషణ. ప్రధాన ఆదేశాన్ని దేవునినుండి వచ్చిన వ్యక్తిగత పిలుపుగా మరియు సమష్టి పిలుపుగా అంగీకరించడంలోని గంభీరమైన ప్రాముఖ్యత గురించి ఈ మూడు రోజుల ప్రయాణం లోతుగా తెలియజేస్తుంది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/