నిబద్ధతనమూనా
యేసు పట్ల నిబద్ధత
యేసు పట్ల మన నిబద్ధత మన ఇతర నిబద్ధతలన్నిటికి పునాది వంటిది.
ఆయనపట్ల మన నిబద్ధతను ప్రతిజ్ఞాపూర్వకంగా తెలియజేస్తున్నాం, బదులుగా, మన
ఇతర నిబద్ధతలన్నిటిని నెరవేర్చడానికి ఆయన మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు.
మనం పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనసుతో పూర్ణబలంతో – మనలోని అణు
వణువుతో ఆయనను మనఃపూర్వకంగా ప్రేమించడంకొరకు పిల్వబడ్డాం – ఆయన
మొదట మనల్ని ప్రేమించాడు గనక మనం ఆయనను ప్రేమించడానికి
శక్తిగలవాళ్లమయ్యాం. ప్రేమ ఆయనయొక్క స్వాభావిక లక్షణం గనక మన పట్ల
ఆయనకున్న ప్రేమను అర్థంచేసు కొనడం మనం ఆయనను తిరిగి ప్రేమించడాన్ని
మరియు మన ప్రేమలోని నిబద్ధతను సులభతరం చేస్తుంది.
యేసు పట్ల నిబద్ధతలో నిలిచి ఉండడమంటే మన జీవితాలలోని ప్రతి క్షణాన్ని మనః
పూర్వకంగా ఆయనకు లోపర్చడమని అర్థం. ఆయన సన్నిధి నిత్యమైందనే
అవగాహనతో, బదులుగా, ఆయన కోరుకుంటున్నట్టుగా ప్రశస్తమైన బహుమానమైన
మన సామీప్యతను ఆయనకు అర్పిస్తూ ప్రతి రోజూ మన ప్రతి విషయంలోను
మనఃపూర్వకంగా ఆయనను చేర్చుకుందాం.
నిబద్ధతలో స్థాయీ వ్యత్యాసాలుండవు, ఇది మనశపూర్వకమైనది. ఇది “అన్నీ” కావాలి.
దేవుడు మనపట్ల సంపూర్ణనిబద్ధత కలిగి ఉన్నాడనేది సత్యం. ఆయన మనకొరకున్నాడు,
ఆయన మనకు వ్యతిరేకంగా లేడు. మనల్ని ఎన్నటికి విడిచిపెట్టనని ఆయన వాగ్దానం
చేశాడు, ఆయన మనతోనే నిలిచి ఉంటాడు. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు,
ఆయనకు మనం కావాలి.
రాజులకు రాజు అయిన ఈ విశ్వసృష్టికర్త మనతో సంబంధాన్ని కోరుకుంటున్నాడనేది
అత్యాశ్చర్యకరమైన సుందర వాస్తవం. ఇది లెక్కించలేనంత అపారమైనది,
ఊహించలేనంత గొప్ప వరం. అయినాగాని మనం కొన్నిసార్లు దీనిని చాలా తేలికగా
చూస్తున్నాం.
ఆయన మనల్ని ముందుగానే ఎరిగి ఉన్నాడని, ఆయనయొక్క సంపూర్ణతతో సహా
అన్నిటిని ఆయన మనకు ఔదార్యంతో అనుగ్రహిస్తున్నాడని తెలుసుకుంటూ, ఆయనను
వెతకడంపట్ల అన్నిటిని మించిన ప్రాధాన్యత మనలో ఉండాలి.
బదులుగా ఆయనను పూర్తిగా హత్తుకుంటూ, మన సర్వస్వాన్ని ఆయనకు ఇవ్వడానికి
మనం నిబద్ధత కలిగి ఉన్నామా?
యేసుపట్ల నిబద్ధత కలిగి ఉండడం ఒక సుందరమైన మారకం, ఇది మనం తీసుకొనగల
అత్యంత గంభీరమైన నిబద్ధత, బదులుగా మనం సాటిలేనిది సకలమైనది అయిన బహు
మానమైన ఆయనయొక్క సర్వసంపూర్ణతను మనం పొందుతాం.
ఈ ప్రణాళిక గురించి
నిఘంటువు నిర్వచనం ప్రకారం నిబద్ధత అంటే, “ఏదైనా కారణంకొరకు, కార్యంకొరకు, లేదా సంబంధంకొరకు అంకితంచేసుకున్న స్థితి లేదా అంకితభావం.” క్రీస్తును వెంబడించే వారుగా మనం నిబద్ధత గల జీవితాలను జీవించడంకొరకు పిల్వబడ్డాం. దేవునితో మన నడకలో నిబద్ధత కలిగి ఉండడం ఒక బలమైన శక్తి, ఇది మనకు పట్టుదలను సహనాన్ని ఇచ్చి మనల్ని వర్ధిల్లజేస్తుంది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/