1
సామెతలు 3:5-6
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
సరిపోల్చండి
సామెతలు 3:5-6 ని అన్వేషించండి
2
సామెతలు 3:7
నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము
సామెతలు 3:7 ని అన్వేషించండి
3
సామెతలు 3:9-10
నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.
సామెతలు 3:9-10 ని అన్వేషించండి
4
సామెతలు 3:3
దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
సామెతలు 3:3 ని అన్వేషించండి
5
సామెతలు 3:11-12
నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
సామెతలు 3:11-12 ని అన్వేషించండి
6
సామెతలు 3:1-2
నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.
సామెతలు 3:1-2 ని అన్వేషించండి
7
సామెతలు 3:13-15
జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
సామెతలు 3:13-15 ని అన్వేషించండి
8
సామెతలు 3:27
మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
సామెతలు 3:27 ని అన్వేషించండి
9
సామెతలు 3:19
జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
సామెతలు 3:19 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు