ఇశ్రాయేలు దేవుడు మాట్లాడారు,
ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం నాతో ఇలా అన్నారు:
‘మనుష్యుల మధ్య నీతిగా పాలించేవాడు,
దేవుని భయం కలిగి పాలించేవాడు,
అతడు మబ్బులు లేని ఉదయాన
సూర్యోదయపు వెలుగులాంటివాడు,
వాన వెలిసిన తర్వాతి వచ్చే తేజస్సులాంటివాడు;
అది భూమి నుండి గడ్డిని మొలిపిస్తుంది.’