యెషయా 64
64
1మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే,
పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి!
2మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు,
ఆ మంటకు నీళ్లు మరిగినట్లు,
మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి,
మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి!
3మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు
మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి.
4తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప
అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు
అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు
ఎవరూ గ్రహించలేదు.
5మీ మార్గాలను గుర్తుచేసుకుంటూ
సంతోషంగా సరియైనది చేసేవారికి సహాయం చేయడానికి మీరు వస్తారు.
అయితే మేము వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు
మీరు కోప్పడ్డారు.
అలా అయితే మేము ఎలా రక్షింపబడగలం?
6మేమందరం అపవిత్రులమయ్యాము,
మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి;
మేమందరం ఆకులా వాడిపోయాము,
గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి.
7ఎవరూ మీ పేరిట మొరపెట్టడం లేదు
మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి ఆరాటపడడం లేదు.
మీరు మా నుండి మీ ముఖం దాచుకున్నారు.
మమ్మల్ని మా పాపాలకు అప్పగించారు.
8అయినా యెహోవా! మీరే మాకు తండ్రి.
మేము మట్టి, మీరు కుమ్మరి.
మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము.
9యెహోవా! ఎక్కువగా కోప్పడకండి;
నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి.
మేమంతా మీ ప్రజలమే కాబట్టి
మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము.
10మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి;
చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి.
11మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరం
అగ్నితో కాల్చబడింది,
మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి.
12యెహోవా! ఇదంతా జరిగిన తర్వాత, మీరు చూసి ఊరుకుంటారా?
మీరు మౌనంగా ఉండి మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉంటారా?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 64: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.