సామెతలు 22

22
1గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది
వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.
2ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు:
వారందరిని కలుగజేసినవాడు యెహోవా.
3వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు,
సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.
4యెహోవాయందలి భయం వినయం;
ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు.
5దుష్టుల మార్గాల్లో వలలు, ఆపదలు ఉన్నాయి,
అయితే తమ ప్రాణాలు కాపాడుకునేవారు వాటికి దూరముగా ఉంటారు.
6మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి,
వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు.
7ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు,
అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస.
8దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు,
వారి భీభత్స పాలన అంతం అవుతుంది.
9ధారాళంగా ఉన్నవారు ధన్యులు,
ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు.
10ఎగతాళి చేసేవాన్ని తోలివేస్తే కలహాలు తొలగిపోతాయి;
తగాదాలు అవమానాలు ముగిశాయి.
11శుద్ధహృదయాన్ని ప్రేమించేవాడు దయ గల మాటలు మాట్లాడేవాడు
రాజును స్నేహితునిగా కలిగి ఉంటాడు.
12యెహోవా కళ్లు తెలివిని గమనిస్తూ ఉంటాయి,
కాని విశ్వాసం లేనివారి మాటలను ఆయన నిరాశపరుస్తారు.
13సోమరి అంటాడు, “బయట సింహమున్నది!
వీధుల్లో నేను చంపబడతాను!”
14వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట;
యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు.
15యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది,
క్రమశిక్షణ దండము దానిని వానిలో నుండి దూరంగా తొలగిస్తుంది.
16లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి
ధనవంతులకు బహుమానాలు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది.
జ్ఞానులు చెప్పిన ముప్పై సూక్తులు
సూక్తి 1
17చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి;
నేను ఉపదేశించే దానికి మీ హృదయాన్ని వర్తింపజేయండి.
18ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం
వాటన్నిటిని మీ పెదవుల మీద ఉంచడం మంచిది.
19మీ నమ్మకం యెహోవా మీద ఉండాలని,
నేను ఈ రోజున వీటిని మీకు, మీకే బోధిస్తున్నాను.
20-21మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని
తద్వారా మిమ్మల్ని పంపినవారికి మీరు సరియైన నివేదిక ఇవ్వాలని,
సలహాలతో తెలివితో కూడిన,
ముప్పది సూక్తులను
నేను మీ కోసం వ్రాయలేదా?
సూక్తి 2
22పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు
అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు,
23యెహోవా వారి వైపున వాదిస్తారు
ఎవరైనా వారిని పతనం చేసేవారిని ఆయన పతనం చేస్తారు.
సూక్తి 3
24కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు,
ఊరకనే కోప్పడే వ్యక్తితో సహవాసం చేయవద్దు,
25నీవు వాని మార్గాలను అనుసరించి
నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో.
సూక్తి 4
26చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని
అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు;
27ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే,
వాడు నీ క్రిందనుండి నీ పరుపునే తీసుకెళ్తాడు.
సూక్తి 5
28నీ పితరులు వేసిన
పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
సూక్తి 6
29తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా?
అల్పులైన వారి ఎదుట కాదు
వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సామెతలు 22: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి