ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంనమూనా

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

10 యొక్క 10

ఉప్పదనం, ప్రకాశవంతం 

లోకంలో ఉప్పుగానూ, వెలుగుగానూ ఉండమని ప్రభువైన యేసు మనుష్యులను కోరుతూ చేసిన ప్రకటనకు ముందు ధన్యతలు ఎందుకు ఉన్నాయి? ఆయన లోకానికి వెలుగు కాదా? ఆయన మన నుండి ఖచ్చితంగా ఏమి ఆశిస్తున్నాడు?

ప్రభువైన యేసు ధన్యతల మీద తన ఉపదేశాన్ని ఈ హెచ్చరికలతో ముగించడానికి కారణం, మన క్రైస్తవ జీవితం ఒంటరిగా కొనసాగేది కాదు, లేదా వాగ్దానం చేయబడిన ఆశీర్వాద జీవితం అంతా మన కోసం మాత్రమే కాదు. మనం ఇతరులను ఆశీర్వదించదానికి మనం ఆశీర్వదించబడ్డాము. ఉప్పు, వెలుగు గా ఉండడం ద్వారా మనం దీనిని చెయ్యగలం. ఉప్పు, వెలుగు రెండూ మన ఉనికి ముఖ్యమైన భాగాలు, కానీ ఒకే తేడా ఏమిటంటే ఒకటి కనిపించదు, మరొకటి ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి, మీరు ఉప్పు లేదా వెలుగుగా ఉండాలి. నిద్రలేని రాత్రులు, అంతులేని విధంగా దుస్తులు శుభ్రపరచడం లాంటి పనులు ఉన్న నూతన తల్లులకు దేవునికి సేవ చేయడానికి దృశ్యమానత లేదా వేదికలు ఉండకపోవచ్చు. వారు తమ స్థిరమైన సేవ, విశ్వసనీయతతో వారి భర్త, పిల్లల జీవితాలను తాకుతూ వారి గృహాలలో అస్పష్టతతో పనిచేస్తారు. అది ఉప్పగా లేకపోతే, అది ఏమిటో నాకు తెలియదు. ఉన్నత స్థాయి ప్రధాన అధికారులు, లేదా వ్యవస్థాపకులకు సిద్ధంగా ఉన్న వేదికలు ఉండవచ్చు. వారి వైపు చూచేవారికీ, వారితో పని చేసేవారికీ దీపపు వెలుగుగా ఉండవచ్చు. అది అక్కడ వెలుగుగా ఉంటుంది. ఈ ఉదాహరణలు సంపూర్ణంగా లేవు, కానీ మీకు ఆలోచన వస్తుంది. మీరు ఉప్పు, వెలుగుగా ఉన్నారు. మీకు ఫేస్‌బుక్‌లో వేలాది మంది అనుచరులు ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని అనుసరించే కొద్దిమందికి, మీరు మీ స్వంతంగా దేవుడు రూపొందించిన నిర్మాణంలో మీరు ప్రభావితం చేసేవారుగా ఉన్నారు. మీరు అనర్గళంగా ఉండకపోవచ్చు, కానీ మీరు దయతో ఉండగలరు, అది వెయ్యి పదాలను మాట్లాడుతుంది. గుంపులో మీరు అదృశ్యంగా భావిస్తున్నారా? కనిపించే తోటి వారితో ఎందుకు మాట్లాడకూడదు, వారు ప్రేమించబడుతున్నట్టు, గమనించబడుతున్నట్టు వారు భావించేలా మీరు ఎందుకు ఉండకూడదు? మీరు మీ సామాజిక వర్గాలలో ప్రముఖంగా ఉన్నారా? అధిక క్షేమం కోసం దానిని ఎందుకు ఉపయోగించకూడదు?

ఆసక్తికరంగా, జీవితం అనూహ్యమైనది కాబట్టి, మన కాలాలు మారుతాయి, మన వేదికలు జారిపోతుండవచ్చు, లేదా మన దృశ్యమానత మసకబారుతుండవచ్చు, అయితే క్రీస్తు అనుచరులుగ మన ప్రభావం ఎప్పటికీ క్షీణించదు. మనం ఉన్న లోకానికి మనం చాలా అవసరం. ఉప్పు లేకుండా భోజనం రుచిలేనిదిగానూ, వెలుతురు లేకుండా గది చీకటిగా ఉన్నట్లుగాను ప్రభావం కోసం మనం సృష్టించబడ్డాము! మీరు ముఖ్యమైన వారు!

గత 10 రోజులుగా మీరు చదివినవాటన్నిటినీ మీరు మననం చేసుకొంటుండగా, మీ ఉద్దేశ్యాన్ని మీకు చూపించమని దేవుడిని అడగండి. మీరు ఎందుకు సృష్టించబడ్డారో, శాశ్వత ముద్రను వదిలివేసే విధంగా ఇతరులను ఏవిధంగా ఆశీర్వదించగలరో ఆయనను అడగండి.

వాక్యము

రోజు 9

ఈ ప్రణాళిక గురించి

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in