ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంనమూనా
సాత్వీకులు ధన్యులు, బలహీనులు కారు
సాత్వీకులు లేదా వినయపూర్వకమైన వారు అధికారం లేదా ఉన్నతి పొట్టితనాన్ని కలిగి ఉంటారు కాని వారు తమ జీవితం కోసం దేవుని చిత్తానికి పూర్తిగా సమర్పించుకొంటారు. కాబట్టి వారు ఆ అధికారాన్ని వినియోగించడం లేదా చూపించుకోవడం అవసరం లేదు. సాత్వీకానికి ప్రభువైన యేసు అత్యంత ఉన్నతమైన ఉదాహరణ. ఆయన ఒక్క మాటతో దూతల సమూహాన్ని తన సహాయానికి ఆజ్ఞాపించగలిగినప్పటికీ ఆయన శారీరకంగానూ, మౌఖికంగానూ వేధింపులకు గురిచేయబడ్డాడు, నిందించబడ్డాడు, బెదిరించబడ్డాడు, పేరుతో పిలువబడ్డాడు, విస్మరించబడ్డాడు. సాత్వీకులు నేటి ప్రపంచంలో విపరీతమైనదిగా అనిపించే భూమిని వారసత్వంగా పొందుతారని యేసు చెపుతున్నాడు, దూకుడుగా ఉండేవారూ, అధిక వాంచ కలిగిన వారూ నేటి ప్రపంచాన్ని స్వాధీనం చేసుకొంటారు. సాత్వీకం పదానికి శాస్త్రీయ గ్రీకు పదం “ప్రాస్”, ఇది యుద్ధ గుర్రాలను వివరించడానికి ఉపయోగించే పదం. ఈ గుర్రాలు సైనిక ప్రయోజనాల కోసం పుట్టి పెరిగాయి, అందువల్ల ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి, చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ ముడి బలానికి అదనంగా అవి అధిక శిక్షణ పొందినవిగానూ, చాలా విధేయతను చూపేవిగానూ ఉంటాయి. కాబట్టి సాత్వీకం పదానికి విశాల అనువాదం “నియంత్రణ కింద ఉన్న శక్తి.”
ప్రభువైన యేసు క్రీస్తును మన స్వంత రక్షకునిగా తెలుసుకొన్న మనలో ప్రతీ ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్దాన శక్తిని కలిగియున్నాము. అయితే మనం వాస్తవంగా సాత్వీకులుగా ఉండటానికి మనం కూడా ఆయనకు పూర్తిగా విధేయులై ఉండాలి. ఈ స్థితిలో మనం ఎవరికి చెందినవాళ్ళం, క్రీస్తులో మనం ఎవరిమి అని తెలుసుకోవడం ధైర్యంగా సాత్వీకులుగా ఉండడానికీ, ఫలితాన్ని దేవునికి అందివ్వగల నమ్మకం కలిగియుండడానికి తగిన సామర్ధ్యాన్ని ఇస్తుంది. సాత్వీకులు బలహీనులు కారు, వారు ధనవంతులు ఎందుకంటే వారి తండ్రి వారికి భూమిని స్వాస్త్యంగా ఇస్తాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in