BibleProject | ఆగమన ధ్యానములునమూనా
మానవత్వం దేవుని విడిచి తనదైన మార్గాలను ఎలా ఎంచుకుందో, తత్ఫలితముగా ఎలా బాధపడుతుందో బైబిల్ చరిత్ర చూపిస్తుంది. కానీ దేవుడు మానవాళికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు, మరియు అతని నుండి విడిపోవడం ఎంత బాధాకరమైనదో అతనికి తెలుసు, కాబట్టి ఆయన యేసును సమాధానపర్చడానికి పంపాడు. యేసు ద్వారా, అన్ని విషయాలు మళ్లీ దేవునితో సామరస్యంగా పునరుద్ధరించబడతాయి.
చదవండి:
కొలొస్సయులు 1: 19-23
పరిశీలించు:
ఈ వాక్యభాగము ప్రకారం, దేవుడు ఏమి చేయాలనుకున్నాడు మరియు యేసు ద్వారా ఆయన దానిని ఎలా నెరవేర్చాడు?
మానవత్వం మరోసారి దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉండేలా చేయడానికి యేసు అనుభవించిన మరియు అధిగమించిన ప్రతిదాన్ని పరిగణించండి .మీరు పరిశీలుస్తు ఉండగా, మీ విస్మయం మరియు కృతజ్ఞతా భావాలను వ్యక్తం చేయడానికి ప్రార్థన చెయ్యండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com